టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు సుకుమార్.  లెక్చరర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు గా చేరారు.  సుకుమార్మూవీ తీసినా అందులో ఓ సైంటిఫిక్ మెథడ్ ఉంటుంది.. పద్దతి ప్రకారం తన పని తాను చేసుకుంటూ వెళ్తారని ఫిలిమ్ వర్గాల్లో టాక్.  అంతే కాదు ఆయన హీరోలను ఎప్పుడు చూసినట్లు కాకుండా కొత్తదనం ఉండేలా ప్రజెంట్ చేస్తుంటారు.  ఆ మద్య ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ మూవీలో స్టైలిష్ లుకింగ్ తో అబ్బుర పరిచారు. ఇక రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోని రంగస్థలంలో ఓ పల్లెటూరి కుర్రాడిగానే కాదు.. చెవిటి వాడిగా ప్రజెంట్ చేశాడు. 

 

ఈ మూవీలో రామ్ చరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.  ఇక పదేళ్ల గ్యాప్ తీసుకొని ఖైదీ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఆ సినిమా తరువాత సైరా నరసింహారెడ్డి సినిమాతో కాస్త నిరాశపరిచియా.. చిరు నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  ఈ మధ్యే సినిమాకు సంబంధించిన మెగాస్టార్ లుక్ లీక్ అయిన సంగతి తెలిసిందే.  దీనిపై రామ్ చరణ్ చాలా సీరియస్ అయినట్లు సమాచారం.  లోకేషన్ లో ఎవరు ఇలాంటి పనులు చేస్తున్నా ఇకముందు సంహించేది లేదని అన్నారు. 

 

గతంలో సైరా మూవీకి సంబంధించిన పలు సీన్లు, ఫుటేజ్ లు లీక్ అయ్యాయి.  కొరటాల సినిమా తర్వాత మెగాస్టార్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మూవీ ఉంటుందని అనుకున్నారు.  కానీ ఇప్పుడు ఎన్టీఆర్ తో ఆయన కమిట్ కావడంతో ఆ ప్లేస్ లో లెక్కల మాస్టర్ సుకుమార్ ఉండబోతున్నట్లు టాలీవుడ్ గుస్ గుస.  రామ్ చరణ్ కు రంగస్థలం వంటి సూపర్ హిట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ తో చిరు నటించేందుకు సన్నద్దం అవుతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: