మెగా క్యాంప్ నుంచి ఓ హీరో సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలోనూ.. ప్రేక్షకుల్లోనూ ఎంతో బజ్ క్రియేట్ అవుతుంది. అదే.. డైరక్ట్ గా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలే వస్తే ఇక చెప్పేదేముంది.. ఆకాశమే హద్దు. హీరోయిన్ దగ్గర నుంచి దర్శకుడు, సంగీత దర్శకుడు, సినిమాటాగ్రాఫర్.. ఇలా ప్రతి విభాగానికి సంబంధించి వివరాలు హైలైట్ అవుతూంటాయి. ప్రతీ విభాగం ది బెస్ట్ లా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అలాంటిది.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది.

 

 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిరంజీవి మాటల్లోనే చెప్పాలంటే ఇప్పటికే మూడు ఫైట్లు ఒక పాట షూటింగ్ కూడా జరిగింది. కానీ.. ఇప్పటివరకూ మెయిన్ హీరోయిన్ విషయంలో ఎటువంటి క్లారిటీ లేదు. త్రిష మెయిన్ హీరోయిన్ రోల్ చేస్తుందని ఇప్పటికీ ఊహాగానాలే తప్ప యూనిట్ కన్ఫర్మ్ చేసింది లేదు. త్రిష కూడా షూటింగ్ లో పాల్గొన్నట్టు సమాచారమూ లేదు. మరి హీరోయిన్ ని అఫిషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తారో యూనిట్ కే తెలియాలి.

 

 

నిజానికి సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఉందనేది వాస్తవం. కానీ వీరికి కూడా సూటయ్యే హీరోయిన్లు ఉన్నారు. మరి ఈ విషయంలో చిరంజీవి అండ్ టీమ్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చూడాలి. శంకర్ దాదా జిందాబాద్ కు కూడా హీరోయిన్ కోసం అన్వేషించి అప్పటికే పెళ్లయిన భామను తీసుకొచ్చారని ఇప్పటికీ ఫ్యాన్స్ బాధపడుతూంటారు. ఈసారి ఇలా చేయరు కదా అని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. మరి.. త్రిషనే ఫైనల్ చేస్తారో మరో హీరోయిన్ ను సెలక్ట్ చేస్తారో రామ్ చరణ్ టీమ్ ప్రకటించాల్సి ఉంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: