టాలీవుడ్ లోకి దేవదాస్ సినిమాతో హీరోగా పరిచయం అయిన రామ్ పోతినేని తర్వాత ఇంస్ట్రీలో మంచి ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.  రామ్ డ్యాన్స్, ఫైట్స్ విషయంలో తన ప్రత్యేక ఎనర్జీ చూపిస్తుంటాడు.  నేను శైలజ సినిమా తర్వాత రామ్ నటిస్తున్న సినిమాలు వరుసగా ఫెయిల్యూర్స్ అవుతూ వచ్చాయి.  అయితే రామ్ కెరీర్ లో పెద్దగా విజయాలు అందుకోకున్నా.. హీరోగా మంచి పొజీషన్లోనే ఉన్నారు.  గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ మంచి సక్సెస్ కావడమే కాదు.. రామ్ ఎనర్జీ ఓ రేంజ్ లో చాటి చెప్పింది. 

 

ఈ మూవీలో డబుల్ దిమాక్ అంటూ రామ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.  ఈ మూవీకి ఛార్మీ నిర్మాతగా వ్యవహరించారు.  స్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే 40 కోట్ల తో బిగెస్ట్ కలెక్షన్స్ వసూళ్లు చేసింది.  ఇస్మార్ట్ శంకర్ టాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ ‘రెడ్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా లో రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తరువాత సినిమా పై అంచనాలు భారీగానే పెరిగాయి.  తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో పోస్టర్ రిలీజ్ చేశారు.  ఈ నెల 28న  సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. 

 

ఈ మూవీలో రామ్ చాలా డిఫెంట్ లుక్ లో కనిపించబోతున్నారట. అంతే కాదు ఈ మూవీలో ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారట రామ్. యితే అందులో ఒకరు దొంగ మరొకరు కాంట్రాక్టర్ అని సమాచారం. అయితే ఆ పోస్టర్ లో దొంగ మాస్ లుక్స్ తో కనిపిస్తుంటే కాంట్రాక్టర్ కళ్ళజోడు పెట్టుకొని కూడా సీరియస్ గా చూస్తున్నాడు.  ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ తాను ఎంచుకునే కథ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: