హీరోల రెమ్యునరేషన్ కు రెక్కలు రావడంతో ఆ ఎఫెక్ట్ బడ్జెట్ పై పడింది. నాలుగేళ్ల క్రితం తెలుగు సినిమా బడ్జెట్ 40కోట్లు ఉంటే.. స్టార్ రెమ్యునరేషన్ 10నుంచి 15కోట్లు ఉండేది. ఈ పారితోషికం రానురాను 20కోట్లకు.. ఆ తర్వాత 30.. 40కోట్లకు చేరింది. సినిమాకు 50కోట్లు తీసుకుంటున్న స్టార్స్ కూడా ఉన్నారు. 

 

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ రెమ్యునరేషన్ ఎవరికీ అందనంత పెరిగింది. బాహుబలి తీసుకొచ్చిన క్రేజ్ ను ప్రభాస్ ను యూజ్ చేసుకుంటూ.. పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. ఈ క్రమంలో బాహుబలి 2 తర్వాత నటించిన సాహో సినిమాకు 100కోట్ల రెమ్యునరేషన్ దక్కింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై మిత్రులు తీసిన సినిమా కావడం.. సినిమా భారీ నష్టాలు చూడటంతో.. తన పారితోషికం తగ్గించుకోవడంతో.. ప్రభాస్ కు 70కోట్లు దక్కింది. తెలుగులో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ నిలిచాడు. 

 

పవన్ కళ్యాణ్ లాస్ట్ మూవీ అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినా... రెండేళ్లుగా యాక్టింగ్ కు దూరంగా ఉన్నా.. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తగ్గకపోగా.. డబుల్ అయింది. గతంలో 20.. 30కోట్ల రేంజ్ లో ఉండే పవర్ స్టార్ కు నిర్మాతలు 50కోట్లు ముట్టజెప్పారని టాక్. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ భారీ రెమ్యునరేషన్ తో స్వాగతం పలికింది. హిందీ హిట్ పింక్ రీమేక్ లో పవన్ నటించేది 20రోజులే అయినా.. 50కోట్లు ఇచ్చారని వార్తలొస్తున్నా.. మినిమం 40కోట్లు ఉంటుంది. క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎం రత్నం నిర్మించే సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ కాబట్టి రెమ్యునరేషన్ 50కోట్లు ఉంటుందని అంచనా. 

 

పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటే.. మహేశ్ మాత్రం పార్టనర్ అయిపోతున్నాడు. సెపరేట్ గా పారితోషికం తీసుకోకపోయినా.. రైట్స్ రూపంలో అంతకుమించి సంపాదిస్తున్నాడు సూపర్ స్టార్. మహేశ్ ఏ సినిమాలో నటించినా.. పార్టనర్ గా మారిపోతున్నాడు. ఈ క్రమంలో పారితోషికం తీసుకోకుండా.. శాటిలైట్.. డిజిటల్ రైట్స్.. హిందీ డబ్బింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంటున్నాడు. ఈ రైట్స్ విలువ 40 నుంచి 50కోట్లు ఉంటుంది. సరిలేరు నీకెవ్వరు రైట్స్ 40కోట్లకు పైగా తీసుకొచ్చిందని సమాచారం. 

 

అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ కావడంతో.. బన్నీ రెమ్యునరేషన్ రేంజ్ పెరిగిపోయింది. నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఫ్లాప్ అయినా.. హిందీ డబ్బింగ్ యూ ట్యూబ్ లో విజయం సాధించింది. ఈ క్రమంలో పారితోషికంతో పాటు..హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా తీసుకుంటున్నాడు బన్నీ. 

 

25కోట్ల రేంజ్ లో ఉండే ఎన్టీఆర్  రెమ్యునరేషన్ కూడా పెరిగింది. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ట్రిపుల్ ఆర్ కోసం ఏడాదిన్నర పాటు మరో సినిమా జోలికి వెళ్లలేదు. దీంతో రెండు సినిమాల రెమ్యునరేషన్ ఒక్క ట్రిపుల్ ఆర్ కే ఇచ్చారని సమాచారం. ట్రిపుల్ ఆర్ కోసం తారక్ తీసుకునే రెమ్యునరేషన్ 50 నుంచి 60కోట్లు ఉంటుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: