ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ గుర్తుందా. అదేనండీ గుడుంబా శంక‌ర్ హీరోయిన్ మీరా జాస్మిన్‌. త‌న అందం అభిన‌యంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది ఈ భామ‌. `అమ్మాయి బావుంది` చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయిన మీరా వరుస సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  గుడుంబా శంకర్, భద్ర, రారాజు, మహారధి, గోరింటాకు, బంగారు బాబు వంటి చిత్రాలలో నటించింది మీరాజాస్మిన్.

 

కేవలం తెలుగులోనే కాకుండా దాదాపు అన్ని భాష‌ల్లో న‌టించి మెప్పించింది. తమిళం, మలయాళం, కన్నడం ఇలా దక్షిణాది భాషల్లో అన్నింటిలో నటించిన మీరా 2014లో దుబాయికి చెందిన ఇంజనీర్ అనిల్ జాన్ ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తుంది ఈ భామ‌. ప్ర‌స్తుతం ఆమెకు ఒక పాప కూడా ఉంది. ఈ మధ్యకాలంలో మీరా లావుగా ఉన్న కొన్ని ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అయి న విష‌యం తెలిసిందే. ఆమెని అలా చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప‌వ‌న్ హీరోయిన్ ఏంటి ఇలా ఉంది అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. 


 
ఇక ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఆమెకు సంబంధించిన మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.  ఆ ఫొటోల‌లో మీరా చాలా సన్నబడింది.  ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్త‌ల్లో ఎలాగైతే ఉందో మీరా మ‌ళ్ళీ అలాగే చాలా అందంగా సరికొత్త లుక్ లో కనిపిస్తుంది. అయితే త్వరలో మీరాజాస్మిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతుందని అందుకే ఆమె తన లుక్ ను పూర్తిగా మార్చేసింది అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి ఆ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ భామ మ‌ళ్ళీ రీ ఎంట్రీ అంటే భూమిక లాగా కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తూ మ‌ళ్ళీ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుందా లేక ఏంటా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్ప‌టికీ ఒక్కోసారి పాత హీరోయిన్ల‌ను చూస్తే వాళ్ళ ఫ్యాన్స్‌కి క‌లిగే ఆనందం మాత్రం అంతా ఇంతా కాద‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: