బాలయ్యకు జోడీ కుదిరింది. బోయపాటి సినిమాలో బాలకృష్ణ హీరోయిన్ గా చాలా పేర్లు వినిపించాయి. ఓ బాలీవుడ్ భామను కూడా అనుకున్నారు. చివరకు ఓ తెలుగు అమ్మాయిని ఫైనల్ చేశారు. ఆల్ రెడీ బాలయ్యతో జత కట్టిన అమ్మాయే రెండోసారి ఆడిపాడనుంది. 

 

బాలయ్య పక్కన హీరోయిన్ని వెతకడం కోసం బోయపాటి చాలా తిప్పలు పడ్డాడు. ముందుగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను అనుకున్నాడు. నయనతార, శ్రియను కూడా సంప్రదించినట్టు సమాచారం. మరేమైందో గానీ.. ఈ ఇద్దరిలో ఒక్కరూ సెట్ కాలేదు. ఈలోగా బడ్జెట్ కంట్రోల్ చేయాల్సి రావడంతో.. కోట్లు ఇచ్చిన నయన.. సోనాక్షిని తీసుకోవడం ఎందుకన్న ఐడియా కావొచ్చు. అంజలిని తీసుకున్నారు.

 

బాలయ్య సినిమాను 70కోట్ల బడ్జెట్ తో తీయాలనుకున్నాడు బోయపాటి. ఈ లోగా కథానాయకుడు.. మహానాయకుడు.. రూలర్ డిజాస్టర్ కావడంతో.. బడ్జెట్ ను కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో.. హీరోయిన్లపై కోట్లు ఖర్చు పెట్టకుండా.. అంజలీని తీసుకొని.. హీరోయిన్ బడ్జెట్ సగానికి పైగా కంట్రోల్ చేశారు. 

 

డిక్టేటర్ తర్వాత బాలయ్యతో రెండోసారి నటించే ఛాన్స్ అందుకుంది అంజలీ. ఈ మధ్యకాలంలో వెయిట్ బాగా కంట్రోల్ చేసి జీరో ప్యాక్ లోకి వచ్చిన అంజలి కుర్రహీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని లుక్ తో ఆకట్టుకుంటోంది. ఈ తెలుగమ్మాయి ప్రస్తుతం నిశ్శబ్దం.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఇంపార్ట్ మెంట్ రోల్స్ పోషిస్తోంది. బాలయ్య సినిమాతో బంపర్ ఆఫర్ అందుకుంది అంజలి. మొత్తానికి అంజలి మరోసారి బంపర్ ఆఫర్ అందుంది. బాలయ్యతో నటించే అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది.

 

యంగ్ హీరోయిన్స్ తో పోటీ పడుతూ తన శరీరాకృతిని అందంగా తీర్చిదిద్దుకుంది. ఇంకేముందీ మళ్లీ అవకాశాలు మొదలైనట్టే కనిపిస్తున్నాయి. అందుకు నిదర్శనమే పవన్ కళ్యాణ్, నిశ్శబ్ధం సినిమాల్లో అవకాశాలు రావడం. ఇంకేముందీ ఈ బ్యూటీ తన టాలెంట్ ఏంటో చూపించేందుకు సిద్దమైపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: