ప్రపంచ వ్యాప్తంగా జనాలను భయకంపితులను చేస్తున్న కరోనా వైరస్ చైనాలోనే కాదు.. ఇతర దేశాల్లో సైతం గజ గజలాడిస్తుంది.  ఇప్పటికే చైనాలో రెండు వేల మందికి పైగా మరణాలు సంభవించాయి.  కరోనా  వల్ల ఎన్నో నష్టాలే కాదు.. వ్యాపార సంస్థలపై కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడ్డాయి.  ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ సినిమాలపై కూడా పెద్ద ఎత్తున పడ్డట్టు చెబుతున్నారు.  ప్రపంచ దేశాల్లో ఎంతో పాపులారిటీ సంపాదించిన సిరీస్ లో వస్తోన్న  ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’ సినిమా షూటింగ్‌పై పడింది. హాలీవుడ్‌ స్టార్‌ హీరో టామ్‌ క్రూయిజ్‌ నటిస్తోన్న ఈ సినిమాను ఇటలీలోని వెనీస్‌లో షూట్‌ చేయాల్సి ఉంది. 

 

మూడు వారాలపాటు షూటింగ్‌కు ప్లాన్‌ చేశారు. అయితే వెనిస్‌లో 150 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే టామ్‌ క్రూయిజ్‌ సినిమా షూటింగ్‌ మొదలు కావాల్సి ఉండగా..కరోనా ప్రభావంతో ఆలస్యం అవుతోంది. ఓవైపు కరోనా ఎఫెక్ట్ వల్ల మరణాలు సంభవిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందుగానే చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.  చిత్ర నిర్మాణ సంస్థ పారామౌంట్‌ పిక్చర్స్‌ కరోనా ప్రభావ పరిస్థితులకు అనుగుణంగా షూటింగ్‌ షురూ చేయాలని భావిస్తోందట. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ వల్ల చిత్రబృందాన్ని తిరిగి వెనక్కి రప్పించాం. వెనిస్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం అన్నారు. 

 

ఇప్పటి వరకు మిషన్ ఇంపాసిబుల్ మూవీకి ఏ రేంజ్ లో పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ మూవీలో యాక్షన్ సీన్లు ఎంతో ఉత్కంఠత రేపుతుంది.  టామ్ క్రూయిజ్ నటిస్తున్న  ఈ మూవీకి భారత దేశంలో కూడా ఎంతో క్రేజ్ ఉంది.  కరోనా వైరస్ కారణంగా లాగూన్‌ సిటీలోని వార్షిక కార్నివాల్ ఫెస్టివల్ నిలిచిపోయిది.  ఈ వ్యాధి విస్తృతంగా పాకుతున్నది. అందుకే షూటింగ్‌ను క్యాన్సిల్ చేశాం అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: