టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన విజయదశమి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన వేదిక, తొలి సినిమా సక్సెస్ కానప్పటికీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత నారా రోహిత్ సరసన బాణం సినిమాలో నటించిన వేదిక, ఆ సినిమాతో మంచి పేరు సంపాదించింది. ఇక ఆపై సుమంత్ హీరోగా తెరకెక్కిన దగ్గరగా దూరంగా సినిమా కూడా పరాజయం పాలవడంతో అక్కడి నుండి కోలీవుడ్, మోలీవుడ్ లో సినిమాలు చేస్తూ ముందుకు సాగిన వేదిక, ఇటీవల నందమూరి నటసింహం బాలయ్య సరసన రూలర్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించి మళ్ళి తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యే ప్రయత్నం చేసింది. 

 

అయితే ఆ సినిమా కూడా అనూహ్యంగా ఫ్లాప్ కావడంతో టాలీవుడ్ పై చాలా వరకు వేదికకు ఆశలు ఆవిరయ్యాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ప్రస్తుతం ఒక తెలుగు, ఒక తమిళ, అలానే మరొక కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న వేదికకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఆ మధ్య లారెన్స్ హీరోగా వచ్చిన ముని, ముని4 సినిమాల్లో కూడా ఆమె నటించి మెప్పించింది. తమిళ అనువాద సినిమా అవడంతో ఆ సినిమా సక్సెస్ అయినప్పటికీ ఆమెకు ఇక్కడ మాత్రం అవకాశాలు దక్కలేదు. 

 

ఇక ఎప్పుడూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండే వేదిక తన సినీ, పర్సనల్ విషయాలకు సంబంధించిన ఫోటోలు, పోస్టుల వంటివి షేర్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే నేడు ఆమె ఒక ప్రముఖ ఫోటో గ్రాఫర్ వద్ద దిగిన ఫోటోషూట్ లోని ఫోటోలను తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో  వేదిక ఎంతో అందంగా కనపడడంతో, అబ్బబ్బా వేదిక, బహుశా దేవకన్యలు కూడా నీ అందం ముందు పనికిరారిక అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: