తొంబ‌యవ ద‌శ‌కంలో తెలుగు ఇండ‌స్ట్రీని త‌న లేత ప‌రువాల‌తో  ఉర్రూత‌లూగించిన హీరోయిన్ల‌లో సిమ్రాన్ చాలా స్పెష‌ల్ అనే చెప్పాలి. ఎట్రాక్టివ్ ఫిగ‌ర్‌తో కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేకెత్తించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ కోసం అప్ప‌ట్లో  టాప్ హీరోలు పోటీప‌డేవారు. మోడ్ర‌న్ లుక్‌తో ఎలాంటి డ్ర‌స్సుల్లోనైనా గ్లామ‌ర్ ఉట్టిప‌డేలా  క‌నిపిస్తుంది సిమ్రాన్‌. అయితే ఈ స్లిమ్ బ్యూటీకి అందం మాత్ర‌మే కాదండోయ్ అభిన‌యం కూడా ఉంది. అందుకే అవ‌కాశాలు కూడా వెతుక్కుంటూ వ‌చ్చాయి. ద‌క్షిణాది భాష‌ల్లో ఎన‌భైకి పైగా సినిమాల్లో న‌టించిన సిమ్రాన్ పెళ్ళి త‌ర్వాత కొన్ని టెలివిజ‌న్ షోలు కూడా చేసింది. సిమ్రాన్ అస‌లు పేరు రిషీబాలానావ‌ల్‌. ఈమెకు ఇద్ద‌రు చెల్లెళ్ళు, ఒక సోద‌రుడు ఉన్నారు. బీకాం పూర్త‌వ‌గానే సిమ్రాన్ మోడ‌లింగ్ రంగాన్ని ఎంచుకుంది. అక్క‌డి నుంచి బాలీవుడ్‌కి ఎంట‌ర్ అయిన ఆమె 1995లో స‌న‌మ్ హ‌ర్జ‌న్ అనే చిత్రంతో సినీ ప్ర‌స్థానం మొదలు పెట్టింది.

 

న్యూజిల్యాండ్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న మొద‌టి భార‌తీయ చిత్రం అదే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. అదే స‌మ‌యంలో ఓ రియాల్టిషోకి వ‌ర్క్ చేసింది సిమ్రాన్ ఆ ప్రోగ్రాం చూసిన జ‌యాబ‌చ్చ‌న్ త‌న సంస్థ నుంచి ఎంక‌రేజ్ చేసింది. అబ్బాయిగారు సినిమాతో టాలీవుడ్‌లో కాలుమోపింది. 
ప్రియా ఓ ప్రియా, మా నాన్న‌కి పెళ్ళి, ఆటోడ్రైవ‌ర్‌, స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర్సింహ‌నాయుడు, క‌లిసుందాంరా, నువ్వొస్తావ‌ని, యువ‌రాజు, డాడి, ప్రేమ‌తోరా, సీత‌య్య మంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించి సూప‌ర్ డూప‌ర్ హిట్స్ కొట్ట‌డ‌మే కాకుండా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. అయితే సిమ్రాన్ త‌మిళంలో కూడా కొన్నాళ్ళు త‌న హ‌వాని కొన‌సాగించింది. జోడి, జుల్లాద‌మ‌నం, వాలి, పంబ‌ల్‌కే సంబంధం, ఏలుమ‌ళై ఇలా ఎన్నో చిత్రాల్లో న‌టించింది. 

 

ఇక ప‌ర్స‌నల్ లైఫ్ విస‌జ్ఞానికి వ‌స్తే కెరియ‌ర్ మంచి పీక్స్‌లో ఉన్న‌ప్పుడే దాంప‌త్య జీవితంలోకి అడుగుపెట్టింది ఈ భామ‌. త‌న చిన్న‌నాటి మిత్రుడు దీప‌క్ తో 2003లో వివాహం జ‌రిగింది. వారిద్ద‌రికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. పెళ్ళ‌య్యాక కూడా చిన్న చిన్నగా అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తూ సినీ ఇండ‌స్ట్రీతో ట‌చ్‌లోనే ఉంది ఈ ముంబై భామ‌. బాల‌య్య సినిమాతో వ‌చ్చిన ఒక్క‌మ‌గాడు చిత్రంతో న‌ట‌న కంటిన్యూ చేసింది. ఆమె త‌న భ‌ర్త‌తో క‌లిసి ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా స్టార్ట్ చేసింది. సిమ్రాన్ కేవ‌లం సినిమాల‌కే కాదు. ఎన్నోసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌ను కూడా అందుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: