మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్  అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో  జూనియర్ ఎన్టీఆర్ తో  కలిసి నటిస్తున్నారు. కాల్పనిక కథ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది ఇదిలా ఉంటే... ఆర్ఆర్ఆర్ ఇంకొన్ని రోజుల్లో పూర్తవుతున్న నేపథ్యంలో.. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అనే దానిపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే.. జూనియర్ ఎన్టీఆర్ తన హిట్ కాంబినేషన్ అయినా త్రివిక్రమ్ తో మరోసారి సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన తర్వాత ప్రాజెక్టును సెట్ చేసుకునే పనిలో పడ్డారని  తెలుస్తోంది. 

 

 

 రాజమౌళి సినిమా అంటే క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఇక ఆ తర్వాత ప్రాజెక్టు కూడా ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే ఉండేలా చూసుకుంటున్నారు మెగా పవర్ స్టార్ రాంచరణ్. ఈ క్రమంలోనే మెగాపవర్ స్టార్  ఎవరితో సినిమా చేయబోతున్నారనే  దానిపై రోజుకు ఒక పేరు తెర మీదికి వస్తూనే ఉంటది. అయితే రామ్ చరణ్  ఎంతోమంది దర్శకులు చెబుతున్న కథలను వింటున్నాడు అంటూ వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే రామ్ చరణ్ ఎట్టకేలకు ఒక ప్రయోగాల దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. విక్రమ్ కె కుమార్ చెప్పిన కథ తో చరణ్ సాటిస్ఫై అయ్యారట. దీంతో ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది కన్ఫర్మ్ అయిందని  మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. 

 

 

 ఎందుకంటే విక్రమ్ కె.కుమార్ ఇంతకుముందు కూడా మెగా హీరోలతో సినిమా చేద్దామని ట్రై చేసి మధ్యలోనే వదిలేశాడు.తర్వాత  గ్యాంగ్ లీడర్ తెరమీదికి వచ్చింది. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల  తర్వాత మరోసారి మెగా హీరో రామ్ చరణ్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది టాక్  వినిపిస్తున్నాయి. అయితే విక్రమ్ కె కుమార్ అంటే అన్ని  ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత చరణ్ నిజంగానే విక్రం తో సినిమాలు చేసీ  ప్రయోగాలు చేస్తాడ అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: