సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ లు  తమ పర్సనల్ విషయాలు ఎంతో సీక్రెట్ గా  ఉంచుకుంటారు అనే విషయం తెలిసిందే. కొంతమంది మాత్రమే తన అభిమానులతో కానీ ఇతరులతో కాని తమ పర్సనల్ విషయాలు పంచుకుంటారు. ఈ క్రమంలోని ఓ నటి  తాను గర్భవతి అన్న విషయాన్ని దాచి పెట్టిన  సెట్లో అందరికీ అనుమానం వచ్చింది అంటూ చెప్పింది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు బాలీవుడ్ నటి నేహా  దుపియా. తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఎవరికీ చెప్పలేదని... కానీ షూటింగ్ చేస్తున్న సమయంలో అందరికీ అనుమానం వచ్చింది అంటూ తెలిపింది. ముంబైలో ఏర్పాటు చేసిన పైగతాన్ వాక్ లో నేహా  దుపియా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేసింది. 

 

 

 దాదాపు నేను పదిహేనేళ్ల పాటు నచ్చిన ఆహారం తినకుండా నోరు కట్టేసుకుని ఉన్నాను అంటూ తెలిపిన ఈ అమ్మడు..  గర్భం దాల్చినప్పుడు మాత్రం ఇష్టం వచ్చింది తిన్నాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగని ఇష్టమైన ఆహారాన్ని తినడమే కాదు... దానికి తగ్గట్లుగానే వ్యాయామం కూడా చేసాను  అంటూ తెలిపింది. అయితే గర్భం దాల్చిన సమయంలో కూడా ఉదయం సమయంలో లేచి  షూటింగ్ సెట్స్ కు వెళ్లిపోయానని  తెలిపిన నేహ దుపియా... ఆ లైఫ్ని ఎంతో ఎంజాయ్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే నేను ఎంత పని లో ఉన్నప్పటికీ నోరు కట్టేసుకుని కూర్చోలేదని ఇష్టమైన ఆహారాన్ని తీసుకున్నాను అంటూ తెలిపింది. ఏది తినాలనిపిస్తే అది తినేసా అని తెలిపింది. 

 

 

 అయితే తాను గర్భం దాల్చిన విషయాన్ని చాలా రోజుల వరకూ ఎవరికి  చెప్పలేదు అంటూ తెలిపిన నేహా ధుఫియా.. సెట్లో షూటింగ్ సమయంలో డైట్ ఫుడ్ కాకుండా నచ్చిన ఆహారం తీసుకుంటే చాలామందికి డౌట్ వచ్చింది అంటూ తెలిపింది. అయితే ఈ విషయంపై చాలా మంది తనను ప్రశ్నించారని కానీ తినాలనిపిస్తుంది కాబట్టి తింటున్నాను అంటూ సమాధానం చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే గర్భిణీలకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను.. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ మీకు నచ్చింది చేయండి గర్భవతి అయినంత  మాత్రాన.. జీవితంలోని అన్ని విషయాలను మార్చేయాలని ఏమీ అనుకోవద్దు అంటూ ఈ అమ్మడు అందరికీ సలహా  ఇచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటులు అంగద్ భేడి తో  డేటింగ్ లో ఉన్న సమయంలోనే ఈ అమ్మడు తల్లయింది. ఆ తర్వాత రహస్యంగా పెళ్లి అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: