టాలీవుడ్ లెజండరీ యాక్టర్ విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అచ్చంగా ఆ నటరత్న పోలికలు పుణికి పుచ్చుకున్న ఈ జూనియర్, చిన్న వయసులోనే బాల రామాయణం సినిమాతో నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వడం, ఆపై నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక  తరువాత నుండి వరుసగా ఒక్కొక్కటిగా వస్తున్న సినిమా అవకాశాలను అందిపుచ్చుకుని అనతికాలంలోనే టాలీవుడ్ యంగ్ టైగర్ గా ఎంతో గొప్ప పేరు దక్కించుకుని, అగ్ర నటుల జాబితాలో చేరారు. ఇక ప్రస్తుతం మరొక స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక హీరోగా నటిస్తున్నారు ఎన్టీఆర్. 

 

ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీ విషయానికి వస్తే, లక్ష్మి ప్రణతి తో ఎన్టీఆర్ కు 2011, మే 5 ఎంతో వైభవంగా వివాహం జరిగింది. ఇక ప్రస్తుతం వారిద్దరికీ అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు తనయులున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి వ్యక్తిగత విషయాల గురించి మనలో చాలామందికి తెలియదు. హైదరాబాద్ లో మార్చి 18, 1992లో నార్నె శ్రీనివాసరావు, మల్లిక దంపతులకు జన్మించిన ప్రణతి, చిన్నతనం అంతా కూడా హైదరాబాద్ లోనే గడిపారని, అలానే తన కాలేజీ విద్యను అక్కడి నాజర్ జూనియర్ కాలేజీలో పూర్తి చేశారని తెలుస్తోంది. ఆమె తండ్రి నార్నె శ్రీనివాసరావు ప్రముఖ వ్యాపార వేత్త, పలు రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ కు కూడా ఆయన ఎండి గా వ్యవహరించారు. తన గ్రాడ్యుయేషన్ అనంతరం ప్రణతికి ఎన్టీఆర్ తో వివాహం జరిగింది. ఇక మొదటి నుండి ప్రణతి మీడియా ముందుకు వచ్చి ఎప్పుడూ మాట్లాడలేదు. 

 

స్వతహాగా మితభాషి అయిన ఆమె ఎక్కువగా మాట్లాడరని, అయితే తన ఫ్రెండ్స్, భర్త మరియు కుటుంబ సభ్యులతో ఆమె ఎప్పుడూ సరదాగా ఉంటారని ఆమె సన్నిహితుల సమాచారం. ఇక, భర్త ఎన్టీఆర్ తో వీలు దొరికినప్పుడల్లా కొత్త సినిమాలు వీక్షించే అలవాటున్న ప్రణతి, ఎక్కువగా అత్తయ్య షాలినితో ఎంతో మమేకమవుతారట. ఇక ఇటీవల తన మామయ్య హరికృష్ణ మరణ సమయంలో భర్త, అత్త లకు ఎంతో చేదోడు వాదోడుగా నిలిచిన ప్రణతి, ప్రస్తుతం గృహిణిగా ఇద్దరు కుమారులను ఎంతో చక్కగా పెంచే పనిలో నిమగ్నం అయ్యారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: