బాలీవుడ్ లో ఈ మధ్య వినూత్నమైన కథలతో సినిమాలని తెరకెక్క్కించి మంచి సక్సస్ లను అందుకుంటున్నారు మేకర్స్. రెగ్యులర్ కథలతో కాకుండా ఎక్కువగా బయోపిక్స్ తో సినిమాలని రూపొందిస్తున్నారు. అలాగే స్వలింగ సంపర్కం అన్న కాన్సెప్ట్ తో సమాజంలో ఒక వర్గం వాళ్ళని చులకనగా చూస్తున్న వాళ్ళకి తప్పు అని చెప్పే ఉద్దేశ్యంతో కొన్ని సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు దర్శకులు. తమిళ్, తెలుగులో వచ్చిన కాంచన సినిమా ఆ తరహా కథాంశం తో రూపొందించినదే. అదే సినిమాని ఇప్పుడు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్నాడు.

 

ఇక అమ్మాయి - అమ్మాయి ప్రేమ.. అబ్బాయి - అబ్బాయి ప్రేమను సనాతన భారతీయ సంప్రదాయం అంగీకరించదా?  ఇలాంటివి పాశ్చాత్య దేశాల్లో అంగీకరించారు కదా! అన్న విషయాలలో చాలామందికి ముఖ్యంగా కుర్రకారుకి రకరకాల సందేహాలు ఉన్నాయి. భారతదేశంలో స్వలింగ సంపర్కులకు కోర్టుల పరిధిలో కొన్ని హక్కులు కావాలని అడిగినా కూడా ఇంకా వాళ్ళ విషయంలో అమానవీయత కనిపిస్తూనే ఉంది. ఇక ఈ తరహా కంటెంట్ తో సినిమాలు తీస్తే వాటికి సెన్సార్ పరమైన చిక్కులు ఉన్నాయి. ఇటీవలే రిలీజైన శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ చిత్రంపై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. 

 

ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ చిత్రాన్ని గల్ఫ్ దేశాలు నిషేధించాయి. స్వలింగ సంపర్కం కాన్సెప్ట్ పై ముస్లిమ్ దేశాలు అభ్యంతరాలు తెలిపాయి. అయినా భారత్ సహా పలు దేశాల్లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఇప్పుడు అటువంటి కాన్సెప్టుతో మరో హిందీ సినిమా తెరకెక్కుతోంది. షీర్ ఖొర్మా అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందిస్తున్నారు. స్వర భాస్కర్- దివ్యాదత్తా ఈ సినిమాలో ప్రేమికులుగా నటించారు. ఫరజ్ ఆరీఫ్ అన్సారీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో స్వర - దివ్యదత్తాలు స్వలింగ సంపర్కులైన ప్రేమికులుగా నటిస్తున్నారు. ఇలాంటి సినిమాలతో సమాజంలో స్వలింగ సంపర్కుల గురించి సందేహాలిస్తున్నప్పటికి ఇంకా వారి పట్ల చిన్న చూపు చూసే వాళ్ళున్నారు. ఇది మారాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: