టాలీవుడ్ సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ నట వారసుడిగా ఆయన చిన్నకుమారుడు మహేష్ బాబు, బాలనటుడిగా దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన నీడ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే బాలనటుడిగా నటించిన పలు సినిమాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన మహేష్, అనంతరం కొంత గ్యాప్ తరువాత పెద్దయ్యాక హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుని మహేష్ కు ఫస్ట్ సినిమాతో ప్రిన్స్ అనే పేరుని తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత రెండవ సినిమాతో కొంత వైవిధ్యంగా అలోచించి ఒక బిడ్డకు తండ్రిగా నటించిన మహేష్, ఆ సినిమాతో కూడా ఎబోవ్ యావరేజ్ విజయాన్ని అందుకున్నారు. 

 

కానీ ఆ సినిమా మహేష్ చేయకుండా ఉండాల్సింది అనే భావన అప్పట్లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో కలిగింది. ఆపై తండ్రి కృష్ణతో కలిసి మహేష్ తొలిసారిగా నటించిన వంశీ సినిమా అప్పట్లో ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇక ఆ సినిమా హీరోయిన్ నమ్రతను ఆ తరువాత మహేష్ తన జీవిత భాగస్వామిగా చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వంశీ పరాజయంతో కొంత ఆలోచనలో పడ్డ మహేష్, తన తదుపరి సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని భావించి, క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీకి నాలుగవ సినిమా అవకాశాన్ని అందించారు. బాలీవుడ్ నటి సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించిన ఆ సినిమాలో మహేష్ బాబు నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. 

 

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమాలో ఎమోషనల్ గా సాగె క్లైమాక్స్ సీన్స్ లో మహేష్ కనబరిచిన నటనపై అప్పట్లో విమర్శకుల నుండి కూడా ప్రశంశలు దక్కాయి. అయితే ఆ సినిమా ప్రివ్యూ ని తన తండ్రి కృష్ణతో కలిసి వీక్షించిన మహేష్, షో పూర్తి అయి బయటకు వస్తుండగా, ఒక్కసారిగా తన దగ్గరకు వచ్చిన కృష్ణ, శభాష్ అంటూ భుజం తన తట్టారని, అలానే సినిమా తప్పకుండా జూబ్లీ ఆడుతుందని అన్నారని, ఆ ఘటనను నేను ఎప్పటికీ మరిచిపోలేనని ఇప్పటికీ మహేష్ పలు సందర్భాల్లో చెప్తూ ఉంటారు. అయితే ఆ తరువాత కృష్ణ చెప్పిన విధంగానే ఆ సినిమా గొప్ప విజయాన్ని అందుకుని రాజకుమారుడు తరువాత మహేష్ కు మంచి కమర్షియల్ సక్సెస్ ని అందించడంతో పాటు కొన్ని కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీని జరుపుకొడవం జరిగింది. అలానే మురారి సినిమా మహేష్ కు స్పెషల్ జ్యురీ క్యాటగిరిలో ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని కూడా అందించింది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: