మెగాస్టార్ చిరంజీవి అంటే మెగా అభిమానులకే కాదు యావత్ తెలుగు ప్రేక్షకిలందరికి పూనకాలొచ్చేస్తాయి. అన్నయ్య అంటే ఎంత అభిమానమే కోట్ల మంది తమ్ముళ్ళు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నారు. చిరంజీవి నుంచి సుప్రీం హీరో చిరంజీవి అన్న పేరుని మెగాస్టార్ చిరంజీవి గా మార్చేసిన అభిమానులను, మెగా తమ్ముళ్ళను అన్నయ్య మెగాస్టార్ ఏ సందర్భం వచ్చిన గుర్తు చేస్తూనే ఉంటారు. స్టేజ్ మీద పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పటికి, దర్శక, నిర్మాతలున్నప్పటికి అందరికంటే ముందుగా అన్నయ్య మాట్లాడేది తన మెగా అభిమానులు, కోట్ల తమ్ముళ్ళ గురించే. అన్నయ నోట 'మీరే నా బలం' అన్న మాట రాగానే ఒక్కో అభిమానికి వెయ్యి ఏనుగుల బలం వచ్చేస్తుంది. 

 

అన్నయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు అభిమానులు థియోటర్స్ ని కొత్త పెళ్ళు కూతురులా ముస్తాబు చేస్తారు. అన్నయ్య స్టిల్స్ ని భారీ కటౌట్స్ గా తయారు చేసి పూల దండలతో అలంకరించి పాలాభిషేకాలు చేస్తారు. ఈ అభిమానానికి అన్నయ్య మురిసిపోని రోజు లేదు. నేను ఈ స్థాయికి వచ్చానంటే అది మీరు చూపించిన ప్రేమ అభిమానాలే. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను అంటూ అన్నయ్య ఎన్నోసార్లు తమ్ముళ్ళని అడుగుతారు. కానీ అన్నయ్య చేస్తున్నది మాత్రం మర్చిపోయారు.

 

అవును .. తన అభిమానులకోసమే కాదు కొన్ని కోట్ల మందికోసం అన్నయ్య పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. అన్నయ్య మీద చూపించిన అభిమానానికి ఏకంగా అన్నయ్య చూపు లేని వాళ్ళకి చూపునిచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రాణం పోశారు. తమ వాళ్ళ కోసం పెట్టిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటీకీ ఎంతో మందికి రక్త దానం చేస్తున్నారు. అలాగే చూపు లేనివాళ్ళకి నేత్రదానం చేస్తున్నారు. ఎప్పటికే ఎంతో మంది అన్నయ్య నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ ద్వారా చూపు పొందిన వాళ్ళు ఉన్నారు.

 

ఆఖరి క్షణాల్లో ఉన్నవాళ్ళు రక్తదానం వల్ల బ్రతికి జీవనం కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. మీ అభిమానులమైనందుకు మేమే ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేమని అంటున్న అభిమానులను లెక్కపెట్టలేము. ఇంత చేస్తున్న మీరు మీకోసం నేనేమి చేయగలను అంటూ మీ గొప్పతనాన్ని చాటుకోవడం నిజంగా గొప్ప విషయం. ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో గాని బయట గాని ఎంత మంది ఉన్నారు ..దటిజ్ మెగాస్టార్. 

మరింత సమాచారం తెలుసుకోండి: