సినీ రంగంలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా వెలిగిన వారు ఒక్కసారిగా పాతాలానికి పడిపోతుంటారు. అప్పటి వరకు చిన్న సినిమాలు మాత్రం చేసిన ముద్దు గుమ్మలు ఒక్కసారిగా స్టార్ లీగ్‌లోకి వచ్చేస్తారు. ఇలా మారడానికి పెద్దగా ఫార్ములాలు కూడా ఏమీ ఉండవు, అదృష్టం కలిసి రావాలి అంతే.

 

90లలో బహు భాషా నటిగా సౌత్‌ నార్త్ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపిన భామ టబు. టాలీవుడ్‌ సినిమాతోనే వెండితెరకు పరిచయం అయినా బాలీవుడ్‌ లో సెటిల్ అయిపోయింది ఆ భామ. అయితే కొత్త తరం హీరోయిన్లు రావటంతో టబుకు హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాయి. అయితే విషయం ముందే తెలుసుకున్న ఈ బ్యూటీ సినిమాల సపోర్టింగ్ రోల్స్‌కు కూడా ఓకే చెప్పింది.

 

పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ రోల్స్‌లోను కనిపించింది. అయినా ఒకటి రెండు సినిమాల తప్ప ఈ భామకు పెద్దగా అవకాశాలు రావటం లేదు. ఇటీవల టాలీవుడ్‌లో చేసిన అల వైకుంఠపురములో సినిమా కూడా టబు కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఈ జనరేషన్‌ హీరోలతోనూ సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన భూమిక కూడా రీ ఎంట్రీలో సక్సెస్‌ కోసం ఎదురుచూస్తోంది. క్యారెక్టర్‌ రోల్స్‌కు టర్న్‌ అయిన తరువాత ఇంట్రస్టింగ్ సినిమాల్లో నటించిన భూమికకు మంచి పేరు వచ్చినా ఒకప్పటి క్రేజ్‌ మాత్రం మళ్లీ రాలేదు. దీంతో సోసో ఇమేజ్‌తోనే బండి లాగించేస్తోంది ఈ బ్యూటి.


 మరో సీనియర్‌ నటి ఆమని పరిస్థితి కూడా అంతే ఉంది. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాల హీరోయిన్‌గా ఫుల్‌ ఫాంలో కనిపించిన ఈ బ్యూటీ లాంగ్ గ్యాప్‌ తరువాత రీ ఎంట్రీ ఇస్తే ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా ఆశించిన స్థాయిలో పేరు మాత్రం రావటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: