ఏంటి ? సుమంత్ అక్కినేని నాగేశ్వర రావు ముద్దుల మనవడు కదా!? అతన్ని దత్తత తీసుకోవడం ఏంటి అనుకుంటున్నారా? అవును.. నిజంగానే సుమంత్ ను అక్కినేని నాగేశ్వర రావు దత్తత తీసుకున్నారు.. సొంత కూతురు దగ్గర సుమంత్ ను దత్తత తీసుకున్నారు.. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు.. 

 

IHG

 

ఇకపూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుమంత్ అంటే అక్కినేని నాగేశ్వర రావుకు ఎంతో ఇష్టం.. సుమంత్ వల్లే నాగేశ్వర్ రావు జీవితంలో కొన్ని కోరికలు నెరవేరయి.. అవి ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావు ఎంతో కష్టపడి పైకి వచ్చారు.. సంవత్సరానికి 6 నుంచి 7 సినిమాల్లో హీరోగా నటించేవారు.. 

 

ఇప్పుడు స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా చెయ్యడమే గగనం.. అలాంటిది అయన ఆ కాలంలో స్టార్ హీరోగా అయినప్పటికీ సంవత్సరానికి 6, 7 సినిమాలు చేసేవారు.. అలాంటి నాగేశ్వర రావుకు ఇంకా ఇంట్లో పిల్లలతో ఉండే సమయం ఎక్కడ ఉంటుంది పాపం.. ఎప్పుడు సినిమాలు.. షూటింగ్ లు చేసే నాగేశ్వర రావుకు పిల్లల పెంపకం అంటే ఏంటో అసలు తెలియదు.. పిల్లలతో గడిపే మధుర క్షణాల గురించి తెలియదు.. 

 

IHG and <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NAGESHWARA RAO AKKINENI' target='_blank' title='akkineni-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>akkineni</a> nageswara rao

 

అలాంటి అక్కినేని నాగేశ్వర రావుకు ఆ మధుర క్షణాలు పరిచయం చేసిన వారు ఎవరు అంటే.. అది సుమంత్ ఏ.. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 6, 7 సినిమాలు తీసే నాగేశ్వర రావు శరీరానికి అలసట వచ్చింది.. అందుకే అయనకు 'అందాల రాముడు' సినిమా షూటింగ్ సమయంలో నాగేశ్వర రావుకు హార్ట్ ఎటాక్ వచ్చింది. 

 

దీంతో ఆ సమయంలో నాగేశ్వర రావు ఒక సంవత్సరం పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే సుమంత్‌ జన్మించాడు. నాగేశ్వరరావు రెస్ట్‌ టైంలో సుమంత్‌ పాకడం, ఆయన పక్కన పడుకోవడం వంటి వాటితో సుమంత్, నాగేశ్వరావుకు  బాగా దగ్గరయ్యారు. దీంతూ నాగేశ్వర రావు ఒక నిర్ణయం తీసుకున్నారు.. 

 

IHG and <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NAGESHWARA RAO AKKINENI' target='_blank' title='akkineni-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>akkineni</a> nageswara rao

 

అయన సినిమాలు చేస్తూ తండ్రి మమకారాన్ని ఎలాగూ పొందలేకపోయారు అని.. కనీసం తాత మమకారాన్ని అయినా పొందాలి అని.. సుమంత్‌ని పెంచి ఆ విధంగానైనా ఆ అనుభూతి అందుకోవాలని నాగేశ్వర రావు భావించి.. అమెరికాలో ఉన్న సుమంత్ తల్లితండ్రులకు సుమంత్ ను దత్తత తీసుకుంటున్నట్టు లేక రాశారట.. 

 

ఆ విధంగా సుమంత్ ను అక్కినేని నాగేశ్వరరావు, ఆయన భార్య అన్నపూర్ణ దత్తత తీసుకొన్నారట.. దీంతో అక్కినేని నాగేశ్వర రావు ఎక్కడ సినిమాలు చేస్తే అక్కడకు సుమంత్ ను తీసుకెళ్లేవారట.. అందరికంటే సుమంత్ పైనే నాగేశ్వర రావుకు ఎక్కువ ప్రేమ ఉండేదట.. అలా సుమంత్ నాగేశ్వర రావుకు ఫేవరెట్ మనవడు అయిపోయాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: