సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. అందుకే ఒక్కోసారి సక్సెస్ ఫుల్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామలు కూడా హీరోయిన్లుగా ప్రూవ్ చేసుకోవటంలో ఫెయిల్ అవుతుంటారు. తొలి సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చినా తరువాత సినిమాల సెలక్షన్లో చేసిన పోరపాట్లు లక్ కలిసి రాకపోవటం లాంటి కారణాలతో కనుమరుగైపోతుంటారు. అలా ఇండస్ట్రీకి దూరమైన ముద్దుగుమ్మలు కూడా చాలా మందే ఉన్నారు.
టాలీవుడ్ స్టార్ ఇమేజ్ అందుకున్న మలయాళి ముద్దుగుమ్మ మీరా జాస్మిన్. రవితేజ, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ వరుస సినిమాలతో ఫుల్ ఫాంలో కనిపించింది. కానీ ఆ తరువాత సినిమాల ఎంపికలో మీరా చేసిన పొరపాట్ల ఆమెను ఇండస్ట్రీకి దూరం చేశాయి. కోలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేస్తున్నా టాలీవుడ్‌కు మాత్రం పూర్తిగా దూరమైంది ఈ బ్యూటీ.
నువ్వే కావాలి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అందాల భామ రిచా. తొలి సినిమాతోనే కుర్రకారు మనసు దోచుకున్న ఈ బ్యూటీ తరువాత బాలీవుడ్‌లోనూ హీరోయిన్గా ఆకట్టుకుంది. అయితే ఆ జోరు ఎక్కువ కాలం చూపించలేకపోయింది. వరుస ఫ్లాప్‌లు ఎదురుకావటంతో రిచా కెరీర్ కష్టాల్లో పడింది. నెమ్మదిగా అవకాశాలు తగ్గి తరువాత పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయింది ఈ భామ.
అదే సమయంలో వచ్చిన హీరోయిన్ అనిత పరిస్థితి కూడా అంతే నువ్వు నేను సినిమాతో హీరోయిన్గా సూపర్ హిట్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తరువాత సినిమాల ఎంపికలో చేసిన పొరపాట్లతో పూర్తిగా కనుమరుగైంది. అయితే బుల్లితెర మీద అవకాశాలు వస్తుండటంతో స్మాల్ స్క్రీన్‌పై కెరీర్‌ను కొనసాగిస్తోంది. పరుగు, అదుర్స్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించిన షీలా పరిస్థితి కూడా అంతే. కెరీర్ స్టార్టింగ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయినే అనిపించిన ఈ భామ తరువాత అదే జోరు చూపించటంలో ఫెయిల్ అయ్యింది. పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది.