ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న భామ పూజా హెగ్డే.  వరస సినిమాలు చేస్తూ , వరసగా హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నది.  టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ భామ ఒక్క తెలుగులోనే కాకుండా అటు హిందీలో కూడా భారీ సినిమాలు చేస్తున్నది. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురంలో సినిమా విజయంతో మంచి దూకుడు మీదున్నది పూజా.  


ఒకవైపు తెలుగులో సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది.  సినిమా విజయంలో పూజా కూడా కీలక భాగస్వామ్యం కలిగి ఉంటోంది.  ప్రస్తుతం ఈ భామ ఇప్పటికే అన్ని విషయాల్లో దూసుకుపోతున్నది.  ఇక ఇదిలా ఉంటె, పూజా హెగ్డే తెలుగులో మరికొన్ని సినిమాలకు సైన్ చేసింది.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత మోడ్రన్ డ్రెస్ లు వేసుకున్నా, చీరకున్న అందం వేరు.  


దాన్ని కట్టుకుంటే వచ్చే గ్లామర్ వేరుగా ఉంటుంది.  అందుకే గ్లామర్ కోసం అన్ని రకాలుగా అందంగా కనిపిస్తుంటారు.  గ్లామర్ గా కనిపించడం కోసం వాళ్ళు పడే  తపన అంతాఇంతా కాదు.  ఎందుకంటే, అందంగా కనిపించాలి అంటే చీర ఒక్కటే మార్గం.  పూజా చీర గురించి కొన్ని మాటలు చెప్పింది.  చీర కట్టుకోవడం అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పిన ఈ భామ, చీరలోని గొప్పదనం గురించి వర్ణించింది.  


హైస్కూల్ లో ఉండగా మొదటిసారి చీరకట్టుకున్నానని, చాలా బాగుందని, కానీ, స్కూల్ లో ఆ చీర ఎక్కడ జారిపోతుందో అని భయపడినట్టు చెప్పుకొచ్చింది.  చీరలో చాలా అందంగా కన్పిస్తామని చెప్పిన పూజా, అది కట్టుకునే సమయంలో పడే బాధలు  వర్ణనాతీతం అని చెప్పుకొచ్చింది.  మొత్తానికి చీరలో ఉన్న గొప్పదనం, చీరకట్టులో ఉన్న తెలుగుదనం గురించి పూజా చెప్పడం చాలా గొప్ప విషయం. మన కవులు చీర కట్టుకునే విధానంపై ఎన్నో పాటలు కూడా రాశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: