ఏ విషయం పై అయినా ప్రకాష్ రాజ్ చాల స్పష్టంగా క్లారిటీతో మాట్లాడుతాడు. ఈ ముక్కు సూటి ప్రవర్తన వల్ల ప్రకాష్ రాజ్ అనేకసార్లు ఇబ్బందులలో కూడ ఇరుక్కున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ప్రకాష్ రాజ్ నిన్న పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు విపరీరతంగా ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. 


దీనితో ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేస్తూ పవర్ స్టార్ వీరాభిమానులు కోపంతో రగిలిపోతున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటున్న ప్రకాష్ రాజ్ తరుచు రాజకీయ అంశాల పై స్పందిస్తూనే ఉంటాడు. ఈ మధ్య  ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ప్రస్తావన వచ్చినప్పుడు ‘ఆయన నాకు సరిగ్గా అర్ధం కారు… అయితే సూటిగా చెప్పాలంటే… ఆయన నన్ను చాలా నిరాశపరిచారు. బీజేపీ ఏం చేసిందని పొత్తు అన్నారో నాకు అర్ధం కాదు. స్పెషల్ స్టేటస్ అన్నారు అది ఏమైందో తెలీదు’ అంటూ కామెంట్ చేసాడు. 


అంతేకాదు ఇదే ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మోడీని యుగపురుషుడి లా కీర్తించిన విషయాన్నీ ప్రస్తావించగా ‘అది ఆయనకు కావొచ్చు నాకు కాదు. ఆయనకు మోడీ ఎంత గొప్ప అయ్యారో మనకు తెలీదు’ అంటూ పవన్ ను ఉద్దేశించి సెటైర్ వేసాడు. ఇప్పుడు ఆ కామెంట్స్ పవన్ అభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పించడంతో ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ మొదలు పెట్టారు. 


ఇదే ఇంటర్వ్యూలో రాజ్ కేసీఆర్ కేటీఆర్ గురించి పొగడ్తలతో ముంచేసి జగన్ ప్రభుత్వం పై మాత్రం ఆచితూచి స్పందించడం మరింత ఆశ్చర్యంగా మారింది. జగన్ గురించి స్పందించడానికి తనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదనీ అయితే తనకు మూడు రాజధానుల ప్రతిపాదన ఏమాత్రం నచ్చలేదు అంటూ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ తాను ఈమధ్య వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు కూడా ఈ మూడు రాజధానుల ప్రతిపాదన పై పెద్దగా ఆసక్తిగా లేరు అని చెప్పడం మరొక షాకింగ్  ట్విస్ట్..

మరింత సమాచారం తెలుసుకోండి: