మెగాస్టార్ చిరంజీవి మాస్ హీరో.  అందులో సందేహం అవసరం లేదు.  మాస్ హీరోగా ప్రతి ఒక్కరికి నచ్చిన వ్యక్తి అయన.  అందుకే మెగాస్టార్ కమర్షియల్ గా విజయం సాధించారు.  మెగాస్టార్ గా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.  అయితే, మెగాస్టార్ కు ఓ కోరిక ఉండేదట.  ఎలాగైనా ఓ గ్రాఫిక్ సినిమాలో నటించాలని అని.  గ్రాఫిక్స్ తో కూడిన సినిమా చేయాలి అంటే చాలా కష్టమైనా పని.

 
రిస్క్ ఎక్కువ.  ఎక్కువ షూటింగ్ చేయాలి.  సినిమా పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. కానీ, పట్టుబట్టి సినిమా చేయాలి అనుకున్నాడు అంజి సినిమా చేశారు.  ఆ సినిమాను ఐదేళ్లపాటు షూటింగ్ చేశారు. అమ్మోరు తరువాత కోడిరామకృష్ణకు డిమాండ్ పెరిగింది.  పైగా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి మెగాస్టార్ డేట్స్ ఇచ్చారు.  మెగాస్టార్ తో గ్రాఫిక్స్ సినిమా చేస్తానని శ్యామ్ గారు మాట ఇచ్చారట.  


ఈ మాటను నిలబెట్టుకోవడానికి శ్యామ్, కోడిరామకృష్ణలు సిద్ధం అయ్యారు.  కోడి రామకృష్ణ గారు కథను సిద్ధం చేసుకొని మెగాస్టార్ కు వినిపించడం జరిగిపోయింది.  కమర్షియల్ సినిమా చేద్దామని చెప్పినా మెగాస్టార్ ఒప్పుకోలేదు. కారణం ఏంటి అంటే, గ్రాఫిక్ సినిమాలని అనుకోవడమే.  సినిమా షూటింగ్ కు దాదాపుగా ఐదేళ్లు పట్టింది అంటే ఎంతలా కష్టపడి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు.  


కొన్ని షాట్స్ ను రోజుల తరబడి చేసేవారు.  అప్పట్లో గ్రాఫిక్స్ మనదేశంలో పెద్దగా అభివృద్ధి చెందలేదు.  అమెరికా, సింగపూర్ వంటి దేశాలకు రష్ పంపించి అక్కడ గ్రాఫిక్స్ చేయించేవారు.  ఒక్క ఇంటర్వెల్ సీన్ కోసమే ఏకంగా ముప్పై రోజులపాటు షూట్ షూట్ చేశారంటే అర్ధం చేసుకోవచ్చు.  ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవిని దర్శకుడు కోడి రామకృష్ణ ఎంతగా కష్టపెట్టారో.  కోడి రామకృష్ణసినిమా కోసం పడిన తపన అంతాఇంతా కాదు.  సినిమా యావరేజ్ గా నిలిచినా బుల్లితెరపై ఇప్పటికి  మెప్పిస్తూనే ఉంటోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: