రాధ... ఒకప్పుడు టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ లో రాధ ఒకరు. ఎందరో స్టార్ హీరోల పక్కన ఆమె నటించి మెప్పించింది. చాలా వరకు ఆమె చేసిన సినిమాలు అన్నీ హిట్స్ గానే ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవి రాధ కాంబినేషన్ ఒకప్పుడు సూపర్ హిట్. వీరి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఇక అప్పుడు స్టార్ హీరోల అందరి సరసన ఆమె నటించింది. కృష్ణ, అక్కినేని, ఎన్టీఆర్, శోభన్ బాబు, చంద్రమోహన్ ఇలా చాలా మంది పక్కన నటించి మెప్పించింది. 

 

అయితే ఆమె వారసురాలిగా అడుగుపెట్టిన కుమార్తె కార్తిక మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో అరంగేట్రం సినిమా జోష్, నాగ చైతన్య పక్కన చేసింది. అయితే ఆమె గ్లామర్ గాని ఆమె నటన గాని ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు అంటూ ఉంటారు. ఆమె నటన అసలు చూడాలనిపించదు అంటూ కామెంట్స్ వచ్చాయి. ఇక హీరోయిన్ కి ఉండాల్సిన గ్లామర్ ఆమెలో లేదని కాబట్టి ఆమె సినిమాల నుంచి తప్పుకుంటే మంచిది అంటూ కొందరు సలహాలు కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసింది కార్తీక. 

 

సినిమా కూడా ఫ్లాప్ అయింది. రంగం అనే సినిమా చేసింది ఆ సినిమా కాస్త పరవాలేదని పించింది. ఆమె నటించిన సినిమాల్లో ఎక్కువగా ఫ్లాపులే ఉన్నాయి. తల్లికి ఇమేజ్ ఉన్నా సరే ఆమెకు మాత్రం దశ తిరగలేదు అనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంది. ఆమె కూడా స్టార్ హీరోయిన్ అవుతుంది అని భావించిన రాధ అభిమానులు ఆమె ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం తో కాస్త డీలా పడ్డారు. అటు తమిళ దర్శకులు కూడా ఆమె ను పెద్దగా పట్టించుకోలేదు. ఇక తెలుగులో పోటీ ఎక్కువగా ఉండటంతో ఆమె అవసరం రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: