టాలీవుడ్ చరిత్రలో చెప్పుకోవాల్సిన సినిమాల్లో అర్జున్ రెడ్డి కూడా ఒకటి. ఆ సినిమా గురించి చెప్పుకునేది ఏముంది అన్నా సరే ఆ సినిమా స్టొరీ లైన్ గాని ఆ సినిమాలో హీరో హీరోయిన్ నటన గాని అన్నీ హైలెట్ గా నిలిచాయి అనేది వాస్తవం. ముఖ్యంగా హీరో హీరోయిన్లు అయితే తమ పాత్రల్లో జీవించారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆ సినిమాకు వాళ్ళు ఇద్దరూ కాకుండా ఎవరు అయినా సరే సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనే టాక్ వినపడింది అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఆ సినిమా మీద ప్రభావం చూపించారో అర్ధం చేసుకోవచ్చు. 

 

ఇక హీరోయిన్ శాలినీ పాండే విషయానికి వస్తే ఆమె హీరో పాత్రకు తగినట్టు నటించింది. ఎక్కడా సిగ్గు పడకుండా ఆకట్టుకుంది ఈ అమ్మాయి. ముఖ్యంగా లవ్ సీన్స్ లో ఆమె నటన పిచ్చేక్కి౦చింది అభిమానులకు. అయితే ఇప్పుడు మాత్రం ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఆ సినిమా ద్వారా ఆమె స్టార్ హీరోయిన్ అవుతుంది అని భావించినా సరే అవకాశాలు మాత్రం ఆమెను వరించడం లేదు అనేది వాస్తవం. మహానటి సినిమాలో కీర్తి సురేష్ పక్కన నటించింది. ఆ సినిమాలో ఆమె నటనకు పెద్దగా ప్రాధాన్యత లేదు. 

 

ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో కనపడినా సోషల్ మీడియాలో కాస్త ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఆక్టివ్ గా ఉన్నా సరే ఆమెకు అవకాశాలు రావడం లేదు. దీనితో ఆమె కనుమరుగు అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు తమిళంలో ఒకటో రెండో సినిమాలు చేస్తుంది. తెలుగులో ఆఫర్లు వచ్చాయని అంటున్నా అవి ఎంత వరకు నిజమో తెలియదు. దీనితో శాలినీ పాండే కనుమరుగు అయిపోయింది అంటున్నారు సిని పరిశీలకులు. అయితే ఆమెకు క్యారెక్టర్ పాత్రలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏ విధంగా నిలబడుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: