టాలీవుడ్ లో ఒకప్పుడు అందగాడు, యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సుమన్. తరువాత కాలంలో ఫ్యామిలీ హీరోగా  ఎదిగారు. హీరోగా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించిన ఆయన, ప్రస్తుతం ప్రాధాన్యత కలిగిన కీలకమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు.  నటుడిగా ఎంతో గొప్ప స్థానానికి వెళ్లాడో అంతే విధంగా కష్టాల్లో పడ్డారు.  ఆయనపై పలు ఆరోపణలు రావడంతో టాప్ పొజీషన్లోకి వెళ్తున్న సుమన్ అనుకోకుండా వెండి తెరకు దూరమయ్యారు.  తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ తన స్థానాన్ని కాపాడుకున్నారు.  మార్షల్ ఆర్ట్స్ లో పట్టభద్రుడైన సుమన్ ఎంతో మంది యూత్ కి ఆదర్శంగా నిలిచారు.. దానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

 

తాజాగా సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ మొదటి సినిమాను కొత్త నటీనటులతో తీసి హిట్ కొట్టిన దర్శకులను నేను గొప్ప దర్శకులుగా భావిస్తాను. ఆల్రెడీ మంచి ఇమేజ్ వున్న ఆర్టిస్టులను పెట్టుకుని తీసిన సినిమాతో విజయాన్ని సాధించడం గొప్ప విషయం కాదు.  తాను సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినపుడు ఎన్నో ఇబ్బందులు పడ్డానని... అప్పట్లో భాష తో కూడా కష్టాలు పడ్డానని అన్నారు. అప్పట్లో దర్శకులు కొత్త నటుకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు.. అందుకే వెండి తెరకు ఎంతో మంది హీరోలు పరిచయం అయ్యారు. 

 

కళ అనేది ఎవరి సొంతం కాదు.. దాన్ని వెలికితీసే సమర్థవంతమైన దర్శకుల చేతిలో పడితే మంచి భవిష్యత్ ఉంటుంది. టాలీవుడ్ లో ఇప్పుడు మంచి డైరెక్టర్స్ ఉన్నారు.. వారు కొత్త నటులకు ప్రోత్సాహం ఇస్తే చాలా బాగుంటుందని అన్నారు. హిట్ సినిమా రీమేక్ గా కాకుండా .. ఫలానా సినిమా మాదిరిగా వుందే అనిపించకుండా ఆ సినిమా ఉండాలి. అప్పట్లో ఆదుర్తి సుబ్బారావు .. ఆ తరువాత దాసరి నారాయణ రావు .. శేఖర్ కమ్ముల ఇలా వీళ్లంతా కొత్తవాళ్లతో సినిమాలు చేసి విజయాలు సాధించినవారే.  

మరింత సమాచారం తెలుసుకోండి: