ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా మాస్టర్. ఖైదితో సూపర్ హిట్ అందుకున్న లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో తమిళంలో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మాస్టర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను తెలుగులో mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తుపాకి తర్వాత తెలుగులో విజయ్ సినిమా ఏది ప్రాఫిట్ తీసుకురాలేదు. అయినా సరే విజయ్ సినిమా అనగానే భారీగా పెట్టేస్తున్నారు.

 

మాస్టర్ సినిమాకు మహేష్ కోనేరు 12.5 కోట్లు పెట్టి రైట్స్ కొన్నారట. ఈ సినిమాకు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో పాట పాడించి ప్రమోట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు మహేష్ కోనేరు. ఎన్.టి.ఆర్ కు పి.ఆర్ గా ఉన్న మహేష్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తున్నాడు. విజయ్ లాస్ట్ మూవీ బిగిల్ ను తెలుగులో విజిల్ గా రిలీజ్ చేసింది కూడా ఈయనే. విజిల్ సినిమా 10 కోట్లతో కొనగా 7 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే మాస్టర్ సినిమా లోకేష్ కనగరాజ్ డిఫరెంట్ గా తీస్తున్నారట. కచ్చితంగా ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ కు నచ్చుతుందని అంటున్నారు.

 

అందుకే విజిల్ కన్నా మరో రెండున్నర కోట్లు ఎక్కువ పెట్టి ఈ సినిమా కొన్నారు. అంతేకాదు ఈసారి తప్పకుండా తెలుగు ప్రమోషన్స్ కు విజయ్ ను దించాలని చూస్తున్నారు. కుదిరితే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ను కూడా తీసుకొచ్చి ఈవెంట్ సక్సెస్ చేయాలని మహేష్ ప్లాన్. మరి ఈ ప్లాన్ వర్క్ అవుట్ అయితే మాత్రం విజయ్ మాస్టర్ కు తెలుగులో సూపర్ బజ్ ఏర్పడుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. లోకేష్ కనగ రాజ్ తీసిన ఖైది తెలుగులో సూపర్ సక్సెస్ అందుకుంది. అందుకే మాస్టర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: