గత కొన్ని రోజులుగా దిల్ రాజ్ రెండవ వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వస్తున్న వార్తల పై దిల్ రాజ్ వైపు నుండి ఖండన రాక పోవడంతో ఈ వార్తలలో ఎంతోకొంత నిజం ఉందా అన్న సందేహాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. అయితే దిల్ రాజ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆ నలుగురు లో ఒక కీలక వ్యక్తి కాబట్టి ఈ విషయం ఆయన వ్యక్తిగత విషయంగా భావిస్తూ ఈ విషయం పై ఎవరు కామెంట్స్ చేయడానికి సాహసం చేయడం లేదు.


ఇలాంటి పరిస్థితులలో గత కొంత కాలంగా దిల్ రాజ్ రెండవ పెళ్ళికి సంబంధించిన వార్తలు సద్దుమణిగాయి. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతూ ఉంటే నిన్న మంగళ వారం దిల్ రాజ్ రహస్యంగా పెళ్ళి చేసుకున్నాడు అంటూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఆసక్తికర కథనాన్ని చాల ప్రముఖంగా ప్రచురించింది.


2017వ సంవత్సరంలో దిల్ రాజ్ భార్య చనిపోవడంతో షాక్ కు గురైన ఈ ప్రముఖ నిర్మాత ఇప్పటికీ ఆ షాక్ లోనే ఉన్నారని దీనితో పైకి నవ్వుతూ కనిపిస్తున్నా షాక్ లోనే ఉన్న దిల్ రాజ్ ను రెండవ పెళ్ళి విషయమై ఆలోచనలు వచ్చేలా ఆయన సన్నిహితులు ప్రోత్సహించారు అని అంటారు. దీనితో మొదట్లో ఇష్టం లేకపోయినా ఈ రెండవ పెళ్ళికి దిల్ రాజ్ అంగీకరించాడని ఈ వివాహానికి ఆయన కూతురు కూడ తన అంగీకారం తెలిపింది అంటూ కథనంలో పెర్కొనపడింది. 


ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని మహిళను దిల్ రాజ్ పెళ్ళి చేసుకున్నాడు అన్న వార్తలు ప్రచురిస్తూ ఈ విషయాన్ని ఇప్పట్లో పబ్లిక్ గా తెలియచేయడం అదేవిధంగా దీనికి సంబంధించి ఎటువంటి చిన్న ఫంక్షన్ కూడ చేసుకోవడం దిల్ రాజ్ కు ఇష్టం లేదు అంటూ ఆ కథనం అభిప్రాయం. దిల్ రాజ్ సమిష్టి కుటుంబం అంగీకారం కూడ ఈ వివాహానికి ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈరోజు ప్రచురించబడ్డ ఈ కథనం హాట్ న్యూస్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: