దేవ‌యాని ఈ పేరు తెలియ‌ని వారుండరు ఈమె తెలుగుతోపాటు, మ‌ల‌యాళంలో క‌లిపి మొత్తం 75 చిత్రాల్లో న‌టించింది. వీటిలో కొన్ని హిందీ సినిమాలు ఒక బెంగాలీ సినిమా కూడా ఉంది.  దేవ‌యాని ప‌లు టెలివిజ‌న్ ధారావాహిక‌ల్లో కూడా న‌టించింది. ఆమె ఓ త‌మిళ ద‌ర్శ‌కుడ్ని ప్రేమించినా పెద్ద‌వాళ్ళు దాన్ని అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఇద్ద‌రు పారిపోయి 2001 ఏప్రిల్ 8న ఒక గుడిలో వివాహం చేసేకున్నారు. వీరికి ఇద్ద‌రు కూతుర్లు కూడా ఉన్నారు. హీరోయిన్ దేవ‌యాని అంటే అందం అభిన‌యం క‌ల‌గ‌లిపిన న‌టి. అలాగే ఆమె న‌టించే పాత్ర ఏదైనా స‌రే నూటికి నూరుపాళ్ళు న్యాయం చేయ‌డం ఆమె క‌ర్త‌వ్యంగా భావిస్తుంది. మొద‌ట అజిత్ సినిమా ప్రేమ‌లేఖ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది త‌మిళ్‌లో. ఆ త‌ర్వాత అదే చిత్రాన్ని తెలుగులోకి కూడా డ‌బ్ చేశారు.

 

అనంత‌రం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి సుస్వాగతం చిత్రంలో న‌టించింది ఈ భామ‌. త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబుతో శ్రీ‌మ‌తి వెళ్ళొస్తా, బాల‌య్య‌కు చెన్న‌కేశ‌వ‌రెడ్డి చిత్రంలో చెల్లిగా నాని సినిమాలో మ‌హేష్‌కి అమ్మ‌గా న‌టించింది. అలాగే జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తాగ్యారేజ్‌లో మంచి పాత్ర‌లో న‌టించి మెప్పించింది. అలాంటి దేవ‌యాని ప్ర‌స్తుతం సినిమాల్లో అవ‌కాశాలు రాక తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల‌ను కూడా ఎదుర్కొంటుంద‌ని స‌మాచారం. అయితే ఈమెకి అందం అభినయం ఉన్నా కూడా ఎందుకోగాని పెద్ద‌గా క్లిక్ కాలేక‌పోయింది. టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ఎందుకోగాని ఆమెను పెద్ద‌గా ఎడాప్ట్ చేసుకోలేక‌పోయింది. ప‌వ‌ర్‌స్టార్ లాంటి ప‌క్క‌న హీరోయిన్‌గా చేసిన‌ప్ప‌టికీ ఆ ఒక్క చిత్రం త‌ప్పించి ఆ త‌ర్వాత ఆమెకు పెద్ద‌గా ల‌క్ క‌లిసిరాలేదనే చెప్పాలి. ఆమె అందం మ‌న టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను పెద్ద‌గా ఆక‌ర్షించ‌లేక‌పోయింది. 

 

ఇక దేవ‌యాని పుట్టిపెరిగింది మొత్తం ముంబ‌యి అయినా కూడా మొద‌టి నుంచి ఆమె చాలా నెమ్మ‌ద‌స్తురాలు. అలాగే ఎవ‌రు ఏమి చెప్పినా కూడా వారి మాట‌కి ఎదురు చెప్ప‌డం ఆమెకి మొద‌టి నుంచి అల‌వాటు లేదు. అయితే ఈ మంచిత‌న‌మే ఆమెకు ప్ర‌స్తుతం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర‌య్యేలా చేసింద‌ని స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: