రేణుదేశాయ్... పెద్దగా సినిమాలు చేయకపోయినా సరే పవన్ కళ్యాణ్ భార్యగా ఆమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ తో బద్రీ, జానీ సినిమాలు చేసిన రేణుదేశాయ్ ఆయన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఒక సినిమా హిట్ అయి ఒక సినిమా ఫ్లాప్ అవ్వడంతో పాటుగా అప్పుడు ఆమెకు అవకాశాలు కూడా పెద్దగా రాలేదు అనే చెప్పాలి. అయితే పవన్ కోసం ఆమె సినిమాలకు దూరం అయింది అనేవారు అప్పట్లో. పవన్ తో పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడంతో ఆమె మళ్ళీ నటించే అవకాశం రాలేదని అంటారు. 

 

అది పక్కన పెడితే... ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో కాస్త హాట్ టాపిక్. అప్పుడప్పుడు సినిమాల్లో కనపడటమే కాకుండా డాన్స్ షోస్ కి జడ్జి గా ఆమె కనపడింది. పవన్ కళ్యాణ్ తో విడాకులు కూడా అయి విడిగా ఉంటుంది. ఆమె పెళ్లి కూడా చేసుకుందని టాక్ వినపడింది. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు నోటికి వచ్చినట్టు ఆమెను సోషల్ మీడియాలో తిట్టడం తో ఆమె తన పెళ్లి ప్రస్తావన సోషల్ మీడియాలో తీసుకురాలేదు అంటున్నారు. 

 

ప్రస్తుతం ఆమె కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే కొన్ని షోస్ కూడా చేస్తున్నారు. బాలీవుడ్ లో అప్పుడప్పుడు ఆమెకు అవకాశాలు వచ్చినా సరే రేణుదేశాయ్ మాత్రం పెద్దగా నటించడానికి ఇష్టపడలేదు అంటారు. దీనికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా ఇప్పుడు మాత్రం ఆమె ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని అంటారు. అందుకే ఆమె సినిమాలు చేస్తుంది అనే ప్రచారం ఉంది. ఆమె ప్రశాంతంగా ఉన్నా లేక ఇబ్బందులు పడినా వదలని సోషల్ మీడియా... ఇప్పుడు ఆమె విషయంలో ఎన్నో ప్రచారాలు చేస్తూ ఆమె వ్యక్తిగత జీవితాన్ని బాగా ఇబ్బంది పెడుతుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఎప్పుడూ ఏదోక ప్రచారం ఆమె కేంద్రంగా జరుగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: