ఇలియానా... టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. వరుస ఆఫర్లతో దాదాపు ఎనిమిదేళ్ళ క్రితం బిజీ బిజీ అయిపోయింది. అటు తమిళ సినిమా కూడా ఆమెను గుర్తించింది కూడా. అయితే తెలుగులోనే ఆమెకు మంచి గుర్తింపు తో పాటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది అనే చెప్పాలి. ఏమైందో ఏమో తెలియదు గాని ఆమె ఒక్కసారిగా సినిమాలకు దూరం అయింది. టాలీవుడ్ లో పదేళ్ళ పాటు ఆమె తిరుగులేని హీరోయిన్ గా ఉంటుంది అని అప్పుడు సినీ పరిశీలకులు కూడా భావించారు. 

 

అనూహ్యంగా ఆమె టాలీవుడ్ కి దూరమైంది. రవితేజా, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా చాలా మంది హీరోల పక్కన ఆమె ఆడి పాడింది. ఆ తర్వాత బాలీవుడ్ మీద కూడా ఆమె దృష్టి పెట్టినా అక్కడ పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదని అంటారు. దీనితో ఆర్ధికంగా ఇబ్బందులు పడి తీవ్ర మానసిక ఒత్తిడిలోకి ఆమె వెళ్లిపోయింది అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత బరువు పెరగడం అవకాశాలు రాకపోవడంతో ఆమె ఆత్మహత్య కూడా చేసుకోవాలని చూసింది అంటారు. ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గాని ఆమె బరువు పెరగడం మాత్రం నిజం. 

 

ప్రస్తుతం మళ్ళీ ఆమె సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తుంది ఇలియానా. అవకాశం వస్తే చాలు ప్రూవ్ చేసుకుంటా అంటుంది. బాలీవుడ్ లో ఆమె ఇప్పుడు ఒక సినిమా చేస్తుంది. ఇటు తెలుగులో కూడా ఒక సినిమా చేస్తుంది. డిమాండ్ లేకపోవడంతో పారితోషకం కూడా తగ్గించింది అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఆమె మాత్రం స్టార్ హీరోయిన్ హోదాను వదులుకుంది. దీనికి ప్రేమ వ్యవహారమే కారణం అనే టాక్ కూడా ఉంది. ఆమె ఒకరితో ప్రేమలో పడి రహస్యంగా పెళ్లి కూడా చేసుకుంది అంటారు. ఇప్పుడు బ్రేకప్ చెప్పి... సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: