ఆర్కే రోజా... ఇటు తెలుగులో అటు తమిళంలో సినిమాల మీద రాజకీయాల మీద అవగాహన ఉన్న ఎవరికి అయినా సరే పరిచయం ఉన్న పేరు ఇది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో, తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రోజా. ఆ తర్వాత కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె మంచి పాత్రలు చేసారు. ఎక్కడ ఉన్నా సరే ఆమెది డామినేట్ చేసే కేరెక్టర్ కావడంతో సినిమాల్లో ఆమెకు వచ్చిన పాత్రలు కూడా దాదాపుగా అలాగే వచ్చాయని అంటూ ఉంటారు. రోజా సినిమా అనగానే ఒక క్రేజ్ ఉండేది అప్పట్లో. 

 

ఆమె తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రోజా. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఆ తర్వాత మళ్ళీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించి అసెంబ్లీ లో అడుగుపెట్టారు. ఆమెలో నాయకత్వ లక్షణాలు ఉండటంతో ఆమెకు ఏ పార్టీలో ఉన్నా సరే మంచి ప్రాధాన్యత లభించింది. ముఖ్యంగా పార్టీ అధినేతలను ఆమె ఆకట్టుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చినా సరే సినిమాల మీద ఆమెకు ఆసక్తి ఎక్కువగా ఉండటంతో అప్పుడప్పుడు నటిస్తున్నారు. 

 

ఇక జబర్దస్త్ వంటి షోస్ లో కూడా రోజా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. అటు తమిళంలో కూడా ఆమెకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ కూడా ఆమెకు వ్యాఖ్యాతగా ఆఫర్లు వస్తున్నాయి. తమిళం కూడా ఆమె అనర్గళం గా మాట్లాడగలరు. ఆమెకు అక్కడ పరిచయాలు కూడా ఎక్కువే. రాజకీయాల్లో రోజాకు వచ్చిన గుర్తింపు గత దశాబ్ద కాలంలో ఏ మహిళకు రాలేదు అనేది వాస్తవం. ఏ విమర్శ అయినా సరే దూకుడుగా చేయడంతో పాటుగా ప్రత్యర్ధులను ఆమె టార్గెట్ చేసే అంశాలు కూడా ఆకట్టుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్యే గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: