జెనీలియా... హుందాతనం ఉన్న హీరోయిన్స్ లో ఈమె పేరు ముందు ఉంటుంది. సినిమాను సినిమాగా చేసింది. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాను ప్రేమించింది. ఏ రూమర్ రాకుండా ఆమె సినిమాల్లో కొనసాగింది. హిట్ వచ్చినప్పుడు పారితోషకం పెంచలేదు, ఫ్లాప్ వచ్చినప్పుడు అవకాశాల కోసం ఆమె ఎవరి గుమ్మం తొక్కలేదు. రితేష్ దేశ్ముఖ్ తో ఆమె ప్రేమాయణం గురించి బాలీవుడ్ లో ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈ రోజుల్లో సినిమాల్లో ఉన్న హీరోయిన్స్ చాలా మంది... ఒకటికి రెండు లవ్ స్టోరీస్ నడిపే వాళ్ళు. 

 

కాని జెనిలియా మాత్రం ఒక్కడినే ప్రేమించింది ఆ ఒక్కడినే పెళ్లి చేసుకుంది. ఆ ఒక్కడి తోనే ముందుకి అడుగు వేసింది. బాలీవుడ్ లో ఆమెకు ఎన్ని పరిచయాలు ఉన్నా సరే తన భర్త మాటను దాటలేదు. తన భర్తతోనే మంచి సినిమాలు చేసింది. తన భర్తకు నచ్చితేనే సినిమాలు చేసింది. ప్రేమ కోసం సినిమాలు వదిలేయడానికి కూడా ఆమె రెడీ అయింది. ఇప్పుడు బాలీవుడ్ లో అప్పుడప్పుడు కనపడుతున్నా సరే ఆమె మాత్రం వరుసగా సినిమాలు చేయడం లేదు. 

 

తెలుగులో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. మెగా హీరో రామ్ చరణ్, మంచు విష్ణు వంటి హీరోల పక్కన నటించింది. కొందరి పక్కన అవకాశాలు వచ్చినా తన భర్తకు ఇష్టం లేదని వాటిని వదులుకోవడానికి సిద్దమైంది. ఆమె సెట్స్ లో కూడా చాలా హుందా గా ప్రవర్తిస్తుంది అంటూ ఆమెతో సినిమా చేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే అల్లరి పిల్లగా ఆమెకు గుర్తింపు వచ్చింది. నటనతో పాటుగా డాన్స్ కూడా ఆమెకు ఒకానొక సందర్భంలో ప్లస్ అయింది కూడా. వరుసగా సినిమా ఆఫర్లు వచ్చినా సరే ఎక్కువగా సినిమాలు చేయకుండా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ ముందుకి వెళ్ళింది.

మరింత సమాచారం తెలుసుకోండి: