ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, కీర్తిరెడ్డి క‌లిసి న‌టించిన చిత్రం తొలిప్రేమ‌. తొలిప్రేమ అంటే ముందు గుర్తువ‌చ్చేది ప‌వ‌న్ కంటేకూడా కీర్తి రెడ్డే ఆ సినిమాలో ఆమె పాత్ర‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది. అలాగే క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌కుడు హీరోయిన్ అంటే కూడా కీర్తిరెడ్డి త‌ప్పించి మ‌రో పేరు గుర్తుకురాదు. ఇంత‌కి కీర్తిరెడ్డి ఎవ‌రంటే మాజీ ఎంపీ కేశ‌ప‌ల్లి గంగారెడ్డి మ‌న‌వ‌రాలు. వృత్తిరిత్యా ఆమె త‌ల్లిదండ్రులు బెంగుళూరులో స్థిర‌ప‌డిపోవ‌డంతో కీర్తి చిన్న‌ప్ప‌టి నుంచి అక్క‌డే పెరిగింది. యూ.ఎస్‌.లో ఉన్న‌త విద్య‌లు ముగించుకుని వ‌చ్చిన ఆమె ఎస్‌.వి. కృష్ణారెడ్డి చిత్రం గ‌న్‌షాట్‌తో తెరంగేట్రం చేసింది. కానీ ప‌వ‌ర్‌స్టార్‌తో న‌టించిన తొలిప్రేమ‌తోనే ఆమె ఫేమ‌స్ అయింద‌ని చెప్పాలి. ఆ త‌ర్వాత ఆమె న‌టించిన చిత్రాలేవీ కూడా పెద్ద‌గా ఆడ‌లేదు. ఒకానొక స‌మ‌యంలో సుమంత్‌తో ప్రేమ‌లో ఉన్న కీర్తిరెడ్డి సుమంత్, మ‌హేష్‌బాబులు మంచి ఫ్రెండ్స్ కావ‌డం అర్జున్ సినిమాలో మ‌హేష్‌కి అక్క‌గా న‌టించింది.

 

ఆ త‌ర్వాత హీరో సుమంత్‌తో వివాహం జ‌రిగింది. కానీ పెళ్ళైన రెండేళ్ళ‌కే సుమంత్‌, కీర్తిల మ‌ధ్య త‌లెత్తిన అభిప్రాయ బేధాల వ‌ల్ల వారిద్ద‌రూ విడిపోయారు. అయితే దానికి ఒక వంతు కార‌ణం సుమంత్ చెల్లెలు సుప్రీయే అని ఇండ‌స్ట్రీలో టాక్ కూడా అప్ప‌ట్లో వ‌చ్చింది. సుమంత్‌కి సంబంధించిన ఏ విష‌యంలో అయినా సుప్రియ జోక్యం ఎక్కువ‌గా ఉండేద‌ట‌. సుప్రియ‌ను అడ‌గ‌కుండా సుమంత్ ఎటువంటి డెసిష‌న్ తీసుకునేవాడు కాద‌ట‌. ఈ విష‌యం కీర్తికి అస్స‌లు న‌చ్చ‌క త‌రుచు వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌ల‌కి కార‌ణం సుప్రీయే అయ్యేది. చిన్న‌ప్ప‌టి నుంచి గారాభంగా పెర‌గ‌డంతో ఆడ‌ప‌డుచు పెత్త‌నం అస్స‌లు స‌హించ‌లేక‌పోయింది కీర్తి. సుమంత్‌తో విడిపోయిన త‌ర్వాత కీర్తి బెంగుళూరుకు చెందిన త‌న ఫ్యామిలీ ఫ్రెండ్‌నే రెండో వివాహం చేసుకుంది. ప్ర‌స్తుతం అమెరికాలో సెటిల్ అయింది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇలా సినిమాల్లో తొలిప్రేమ అంటే ముందు గుర్తువ‌చ్చేది కీర్తిరెడ్డే కానీ టాలీవుడ్లో మాత్రం ఆమెకు రెండో ప్రేమ లేకుండాపోయింది. అంటే ఈ పాటికి మీకు అర్ధ‌మ‌య్యే ఉంట‌ది క‌దా. 

మరింత సమాచారం తెలుసుకోండి: