నయనతార సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. రజినీకాంత్ తో చేసిన చంద్రముఖి సినిమా నుంచి ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా భారీ విజయం తరువాత నయనతారకు భారీ డిమాండ్ పెరిగింది. ఆ తరువాత వచ్చిన గజినీ సినిమాలో కూడా నయనతార సూపర్ గా నటించి మెప్పించింది. ఆ తరువాత తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఈ హీరోయిన్ మంచి విజయాలు నమోదు చేసుకుంది.
శ్రీరామ రాజ్యం సినిమా వరకు కూడా ఈ టాప్ హీరోయిన్ సినిమాలు చేసింది. ఆ తరువాత సినిమాల నుంచి పక్కకు తప్పుకున్నట్టుగా ప్రకటించినా, కొన్ని రోజుల తరువాత తిరిగి ఎంట్రీ ఇచ్చింది. అయితే, సెకండ్ ఎంట్రీ ఇచ్చిన తరువాత నయనతార భారీ విజయాలు సొంతం చేసుకుంది. భారీ విజయాలతో పాటుగా అన్ని రకాలుగా విజయం సాధిస్తూ దూసుకుపోతున్నది.
అయితే, నయనతార సినిమాల విషయంలో కొన్ని నియమాలు పెట్టుకుంది. అవేమంటే, సినిమాల్లో నటించడం మాత్రమే చేస్తుంది. ప్రమోషన్స్ లో పాల్గొనదు. ప్రమోషన్ విషయంలో దూరంగా ఉంటుంది. అంతేకాదు, రెమ్యునరేషన్ విషయంలో కూడా సీరియస్ గా ఉంటుంది. అయితే, నయన్ కు డిమాండ్ అధికంగా ఉండటంతో నిర్మాతలు కూడా పెద్దగా పట్టించుకోలేదు.
కానీ, ఇప్పుడు తమిళంలో మిగతా హీరోయిన్లకు డిమాండ్ పెరుగుతూ వస్తున్నాయి. ఇతర బాషా చిత్రాల నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వ్యక్తులు పెరిగిపోతున్నారు. ఇది నయన్ కు కొంత ఇబ్బంది పెట్టె విధంగా మారిపోయింది. దీంతో క్రమంగా అవకాశాలు తగ్గిపోవడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అందుకే అవకాశాలు దక్కించుకోవానికి గతంలో కాజల్ చేసినట్టుగానే నయన్ చేయడం మొదలు పెట్టింది. తిరిగి అవకాశాలు దక్కించుకుంటోంది. దీంతో పాటుగా నయన్ ప్రమోషన్ విషయంలో కూడా ఓ చూపు చూస్తే బాగుంటుందని అంటున్నారు. మరి నయన్ అలా చేస్తుందా ? చూద్దాం. ఇబ్బంది ఉన్నది కాబట్టి అప్పుడు తప్పలేదు. మళ్ళీ టాప్ పొజిషన్లోకి వెళ్తే అలానే చేస్తుందేమో ఎవరికి తెలుసు.