రూలర్ సినిమా ఫ్లాప్ తర్వాత నందమూరి బాలకృష్ణ... తనకు రెండు హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వీరి కాంబినేషన్ లో మూడో సినిమా. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సింహా, లెజెండ్ బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. అయితే గత మూడేళ్ళు గా బాలకృష్ణ కు మంచి హిట్ లేదు అనేది వాస్తవం. దీనితో బాలయ్య మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నారు. తన తండ్రి బయోపిక్ బాలకృష్ణ ను ఇబ్బంది పెట్టింది. ఆ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. 

 

ఇటీవల వచ్చిన రూలర్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. గత ఏడాది చివర్లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ ఏ పాత్రలో నటిస్తారు అనేది ఆసక్తిగా ఉంది. ఆయన వారణాసి లో అఘోరాగా నటిస్తారు అంటున్నారు. ఆయన అందుకే గుండు కూడా చేయించుకున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల బాలకృష్ణ గుండు తోనే కనిపించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర కోసం బాలకృష్ణ బరువు కూడా తగ్గారు అనేది సినీ జనాల మాట. ఇక తాజాగా ఈ సినిమా గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. 

 

ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరా లో ఒక పాత్రలో నటించడమే కాదు కవలలుగా నటిస్తున్నారట. అప్పుడెప్పుడో రాముడు భీముడు, అపూర్వ స‌హోదరులు చిత్రంలో క‌వ‌ల‌లుగా న‌టించిన బాల‌కృష్ణ ఆ తర్వాత మళ్ళీ క‌వ‌ల‌లుగా క‌నిపించ‌లేద‌ని చెప్పాలి. దీనితో చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ బాలకృష్ణ అలాంటి పాత్రలో నటిస్తున్నారు. క‌వ‌ల‌ల్లో చిన్న‌ప్పుడే ఇద్ద‌రూ విడిపోయి... ఒక‌రు వార‌ణాసి లో.. మ‌రొక‌రు రాయలసీమలో అనంత‌పూర్‌ లో క‌న‌ప‌డ‌తార‌ట‌. వార‌ణాసిలో పెరిగిన అఘోరా బాల‌కృష్ణ పాత్ర ఇంట‌ర్వెల్‌లో ఎంట్రీ ఇస్తారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: