హీరోయిన్ కీర్తి రెడ్డి తెలుగు ప్రేక్షకులకు తెలియనిది కాదు. ఇప్పటికి కీర్తి రెడ్డి కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో... తెలుగు చిత్ర పరిశ్రమకు గన్ షాట్ మూవీతో పరిచయం అయినప్పటికీ ఈ అమ్మడికి అంతగా గుర్తింపు లభించలేదు... కానీ పవన్ కళ్యాణ్ తో చేసిన తొలి సినిమాతో మాత్రం ఒక్క సారిగా క్రేజ్ సంపాదించింది కీర్తి రెడ్డి. ఇక తొలిప్రేమ సినిమాలో బాలు బాలు అంటూ పవన్ కళ్యాణ్ ని పిలుస్తూ తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక పవన్ కళ్యాణ్ తో నటించిన తొలిప్రేమ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 

 

 

 ఇకపోతే పవన్ కళ్యాణ్ కీర్తి రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన తొలిప్రేమ సినిమా మంచి విజయం సాధించడంతో... అటు పవన్ కళ్యాణ్ తో పాటు ఇటు కీర్తి రెడ్డి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఆ తర్వాత కీర్తి రెడ్డి కి ఎన్నో అవకాశాలు కూడా వస్తున్న సమయంలో... 2004 సంవత్సరంలో హీరో సుమంత్ ను వివాహం చేసుకుంది. సుమంత్  తో వివాహం జరిగిన తర్వాత కీర్తి  రెడ్డి తెలుగు తెరపై ఎక్కడా కనిపించిన దాఖలాలు మాత్రం లేవు  పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూనే వచ్చింది కీర్తి రెడ్డి. ఇక మహేష్ బాబు హీరోగా వచ్చిన అర్జున్ సినిమాలో మాత్రమే నటించింది. ఈ సినిమాలు మహేష్ బాబు అక్క పాత్రలో నటించింది కీర్తి రెడ్డి.

 

 

 అయితే మహేష్ బాబు సుమంత్ మంచి స్నేహితులు కావడంతో మహేష్ బాబు నటించినట్లు తెలుస్తోంది. అయితే 2004లో కీర్తి రెడ్డి అక్కినేని సుమంత్ పెళ్లి జరగగా రెండు సంవత్సరాల్లోనే ఈ జంట విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. ఇదిలా ఉంటే ఒకవేళ సుమంత్ తో  పెళ్లి జరగకపోతే ఉంటే కీర్తి రెడ్డి కెరియర్ గ్రాఫ్  ఎక్కడికో వెళ్ళి పోయేది అని సినీ విశ్లేషకులు ఇప్పటికే అంటూనే ఉంటారు. సుమంత్ తో  పెళ్లి తర్వాత కీర్తి రెడ్డి కెరీర్ మొత్తం ఆగిపోయింది. సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. తొలిప్రేమ తో మంచి క్రేజ్ సంపాదించిన కీర్తి రెడ్డి పెళ్లి తర్వాత మాత్రం ఎన్ని అవకాశాలు వచ్చినా రిజెక్ట్  చేస్తూనే వచ్చింది. కీర్తి రెడ్డి కి  ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో అభిమానులున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: