గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాహుబలి కారణంగా మన మేకర్లందరికీ పాన్ ఇండియా మీద దృష్టి పడింది. అందుకే ప్రతీ ఒక్కరూ పాన్ ఇండియా జపం చేస్తున్నారు. అయితే పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీయాలంటే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు పెట్టి తీస్తానంటే కుదరదు. అందువల్ల తెలుగు సినిమాల కథల్లో చాలా మార్పులు వచ్చాయి.

 

 


కథల్లోనే కాదు కథ చెప్పే విధానంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. కంటెంట్ బేస్డ్ ఉన్నవాటికే ప్రాధాన్యం పెరుగుతుంది. అందుకే మన సినిమాలకి బాలీవుడ్ లో మంచి గిరాకీ ఏర్పడింది. తెలుగులో బాగా ఆడిన సినిమాలని బాలీవుడ్ లో రీమేక్ చేసుకుని లాభాలు దండుకుంటున్నారు. అలాగే మన దర్శకులకి బాలీవుడ్ లో డిమాండ్ పెరిగింది. అర్జున్ రెడ్డి తీసిన దర్శకుడు అదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తే అక్కడి జనం విరగబడి చూశారు.

 

 

ఇప్పుడు జెర్సీ , ఆర్ ఎక్స్ 100 సినిమాలు అక్కడ రీమేక్ అవుతున్నాయి. మన సినిమాల మార్కెట్ పెరిగినప్పటి నుండి బాలీవుడ్ భామల చూపు ఇటువైపు పడింది. గతంలో బాలీవుడ్ భామలు దక్షిణాది సినిమాల్లో నటించడమంటే చులకనగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగులో నటించడానికి బాలీవుడ్ భామలు సిద్ధంగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే ఈ విషయమై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

 

 

83 సినిమాలో కపిల్ దేవ్ భార్య రోమీగా నటిస్తున్న దీపిక మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. నాకు తెలుగు సినిమాల్లో నటించాలని ఉందని, ఛాన్స్ వస్తే అక్కడ నటిస్తానని, మహేష్ బాబు అంటే తనకి ఇష్టమని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు వద్దన్న తారలే నేడు వస్తున్నారంటే నిశ్చయంగా తెలుగు సినిమా ఎదుగుతున్నట్టే..

మరింత సమాచారం తెలుసుకోండి: