తమిళ నటుడు సూర్యకి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అయితే గత కొంత కాలంగా ఈ మార్కెట్ కి బీటలు పడ్డాయి. సింగం ౩ మొదలుకుని మొన్నటి బందోబస్త్ వరకు సూర్య నటించిన ఏ సినిమా కూడా తెలుగులో సరైన ఆదరణ దక్కించుకోలేదు. బందోబస్త్ సినిమా తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే తెలుగులో కనీస వసూళ్ళు రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం సూర్య "ఆకాశం నీ హద్దురా" అనే సినిమా చేస్తున్నాడు.

 

 

నిజ జీవితకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. సుధ కొంగర గతంలో వెంకటేష్ తో గురు అనే సినిమా తీసి మంచి పేరు తెచ్చుకుంది. ఆకాశం నీ హద్దురా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతుంది. ఈ సినిమా కోసం సూర్య స్పెషల్ ప్లాన్ చేస్తున్నాడట. తెలుగులో మార్కెట్ కోల్పోయిన సూర్యసినిమా ద్వారా ఆ మార్కెట్ ని తిరిగి సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

 

 

సాధారణంగా సూర్యకి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. ఆయన సినిమాలన్నింటికీ లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ మొత్తంలో వస్తారు. మొదటిరోజు థియేటర్ల వద్ద అమ్మాయిల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకని వారి కోసం స్పెషల్ షోలు వేయాలని భావిస్తున్నాడట. ఈ షోకి కేవలం అమ్మాయిలకి మాత్రమే అనుమతి ఉంటుంది. అవును మీరు వింటున్నది నిజమే.. తమిళనాడు తర్వాత తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న కేరళలో లేడీ ఫ్యాన్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ లని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాడట.

 

 


ఈ షో గురించిన మిగతా వివరాలను త్వరలోనే పూర్తిగా తెలియజేస్తారట. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల అవుతుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: