కొందరు హీరోయిన్లు ఎక్కువ సినిమాలు చేయరు. మరికొందరు నటించింది ఒక్క సినిమా అయినా కూడా ఎప్పటికీ మరిచిపోలేని మాయ చేస్తుంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి వారు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నారు. అందులో బ్యూటీ అన్షు ఒక‌రు. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆన్ స్క్రీన్ పై హీరోయిన్స్ తో చేసే రొమాన్స్ గురించి అందరికీ తెలుసు. అందుకే ఆయనను మన్మథుడు అని కూడా అంటారు. ఇక ‘మన్మథుడు’ సినిమా పుణ్యమా అని ఆ ట్యాగ్ లైన్ నాగ్ కు పర్మినెంట్ అయిపోయింది. ఇక ఈ చిత్రంలో నాగార్జున సరసన ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒకరు సోనాలీ బింద్రె, మరొకరు అన్షు. సోనాలీ బింద్రె గురించి పక్కన పెడితే… `నేను నేనుగా లేనే…నిన్న మొన్నల` అనిపించేసింది అన్షు.

 

తన ఫర్స్ట్ లుక్ లోనే…`పువ్వులో లేనిది, తన నవ్వులో ఉన్నది` అని ప్రూవ్ కూడా చేసుకుంది. నిజంగానే తనని చూసి వెన్నెలే తల దించుకుంటుంది. ఇక ఈ బ్యూటి రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ కి జోడీ గా కూడా నటించింది. మ‌రియు కొంత కాలం కన్నడ లో కూడా నటించింది. తెలుగులో చేసింది త‌క్కువ‌ సినిమాలే అయినా.. ఆకట్టుకునే నటన, అమాయకమైన చూపులు, మాటలతో అన్షు అప్పట్లో కుర్రాళ్లను ఫిదా చేసింది. ఈ క్ర‌మంలోనే అన్షు స్టార్ హీరోయిన్ అవుతుంద‌ని అంద‌రూ భావించారు. అయితే ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఆమె సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మైంది.

 

అయితే స‌మాచారం ప్ర‌కారం చదువులు పేరు చెప్పి లండన్ వెళ్లిపోయిందట ఈ బ్యూటి. ఇక అప్పటినుంచి సినిమా అనే ప్రపంచాన్నే మర్చిపోయిన అన్షు.. ప్రస్తుతం లండన్ లో ఓ డిజైనర్ దుస్తుల దుకాణం నడుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మధ్యలోనే అక్కడే ఉంటున్న సచిన్ సగ్గార్ అనే వ్యాపారిని పెళ్లి కూడా చేసేసుకుని అన్షు సగ్గార్ గా మారిపోయింది ఈమె. 'ఇన్ స్పిరేషన్ కౌచర్' అంటూ ఆమె నడిపే దుకాణంలో బాలీవుడ్ హీరోయిన్లు ధరించిన డ్రస్సులకు దగ్గరగా ఉండే డూప్లికేట్ డిజైన్లను తయారు చేసి అమ్ముతారట. ఇక అన్షుకు ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు కూడా ఉన్నారు. మొత్తానికి కొందరు హీరోయిన్లు ఎంత ఫేమ్ వచ్చినా కూడా.. అదంతా కాదనుకుని.. సింపుల్ గా బ్రతకడానికే ఇష్టపడతారు. అందులో అన్షు కూడా ఒక‌రు అనిపించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: