టాలీవుడ్ ను ఒకప్పుడు తన అందాలతో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్స్ జాబితాలో అందాల రాశి పేరు తప్పకుండా ఉంటుంది. అలాంటి రాశి సడెన్ గా అసోషియేట్ డైరక్టర్ ను పెళ్లాడింది. ఆమె యెస్ అంటే ఎంతోమంది హీరోలు ఆమెను పెళ్లాడాలని అనుకున్నారు కాని ఆమె మాత్రం తన మనసుని ఓ అసిస్టెంట్ డైరక్టర్ కు ఇచ్చింది. పెళ్లికి ముందు సూపర్ క్రేజ్ ఉన్న ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది.

 

90వ దశకంలో హాట్ ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ లో రాశి ఒకరు. పెళ్లికి ముందు వరకు సినిమాల్లో చాలాకీగా నటించిన ఈ అమ్మడు అందరు హీరోయిన్స్ లానే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అడపాదడపా ఏదో సాంగ్స్ లో కనిపించడం తప్ప ఫుల్ లెంగ్త్ సినిమాలు చేయలేదు. అయితే రాశి నిమాతగా మారి ఈమధ్యనే ఓ సినిమా చేశారు. అది కూడా నిరాశపరచింది. రాం చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో అనసూయ పోశించిన రంగమ్మత్త పాత్రకు ముందు రాశినే అనుకున్నారట దర్శకుడు సుకుమార్.

 

అయితే ఆ పాత్రలో తను సూట్ అవనని.. అదీగాక అందులో శారీ మోకాళ్ల పైకి కట్టాలని రాశి ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రాశి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నా సరైన అవకాశాలు రావట్లేదని తెలుస్తుంది. ఈమధ్యనే ఆలి షోకి ఇంటర్వ్యూ ఇచ్చిన రాశి ఇక మీదట సినిమాల్లో నటించడానికి సిద్ధమని చెప్పారు. మరి రాశి ఇచ్చిన ఓపెన్ ఆఫర్ ను మన దర్శకులు వాడుకుంటారో లేదో చూడాలి. అయితే హీరోయిన్ గా ఉన్న తన బోల్డ్ ఇమేజ్ కు దూరంగా ఇక మీదట మంచి పాత్రలు చేయాలని చూస్తుంది రాశి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: