కొన్నిసార్లు సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా తొలి సినిమాతోనే కొంద‌రు ముద్దుగుమ్మ‌లు అలా గుర్తుండిపోతారు. సింగిల్ మూవీ వండర్స్‌గా నిలిచి ఆ త‌ర్వాత క‌న‌మ‌రుగైపోయినా హీరోయిన్లు ఉన్నారు. అలాగే ఎన్నో సినిమాలు న‌టించి.. త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేకమైన‌ గుర్తింపు తెచ్చుకుని.. ఆ త‌ర్వాత సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మైన వారు ఉన్నారు. దీనికి కార‌ణాలు అనేకం కావొచ్చు. అవ‌కావాలు లేక‌పోవ‌చ్చు.. వ‌చ్చిన అవ‌కాశాలు వాళ్ల‌కు న‌చ్చ‌క‌పోవ‌చ్చు. ఏదేమైన‌ప్ప‌టికీ స్టార్ హీరోయిన్స్‌గా సినిమా ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపిన వాళ్లు ఒక్క‌సారిగా సినిమా రంగం నుంచి దూర‌మైపోవ‌డం అనేది నిజంగా ఆశ్చ‌ర్య‌క‌రం.

 

ఇక ఇలాంటి వారిలో హీరోయిన్ మాళవిక ఒక‌రు. ఈమె అస‌లు పేరు శ్వేత కొన్నూర్ మీనన్. ఈమె త‌మిళ కుటుంబానికి చెందింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించిన మాళవిక, శ్రీకాంత్ హీరోగా నటించిన చాలాబాగుంది చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. హీరోయిన్‌గా తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టిన మాళ‌విక అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఇక చాలాబాగుంది సినిమాతో తెలుగు సినిమా కెరీర్ స్టాట్ చేసిన ఆమె ఆ త‌ర్వాత దీవించండి, శుభాకార్యం, నవ్వుతూ బతకాలిరా, ప్రియ నేస్తమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది.

 

అయితే తెలుగులో న‌టించింది అతి త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ.. గ్ల‌మ‌ర‌స్ హీరోయిన్‌గా ఇక్కడ తెలుగు తెర ప్రేక్ష‌కుల‌ను బాగానే అక‌ట్టుకుంది. అలాగే కోలీవుడ్‌లోనూ దాదాపు ముప్పై సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అనిపించుకున్న మ‌ళ‌విక‌కి సినిమా అవ‌కాశాలు రానురాను త‌గ్గుతూ వ‌చ్చాయి. దీంతో మంచి హీరోయిన్‌గా ముద్రవేసుకున్న మాళవిక అనంతరం ఐటమ్‌సాంగ్‌లలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా కోలీవుడ్‌లోనూ మాళవిక చేసిన ఐటమ్‌సాంగ్‌లు బంపర్ హిట్ అయ్యాయి. అయితే తెలుగులో అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాలో న‌టించే టైమ్‌లో మాళ‌విక‌కు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు ఎఫైర్లు ఉన్న‌ట్టు అనేక రూమ‌ర్లు వ‌చ్చాయి.

 

దీంతో మాళ‌విక సినిమా ఇండ‌స్ట్రీని వ‌దిలేసి వెళ్లిపోయింది అన్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. మ‌రోవైపు అవ‌కాశాలు లేక‌పోవ‌డం వ‌ల్లే ఇండ‌స్ట్రీని వ‌దిలేసింద‌ని కూడా రూమ‌ర్లు వ‌చ్చాయి. ఇక ఆ త‌ర్వాత మాళ‌విక 2007లో పారిశ్రామికవేత్త సుమేష్ మీనన్‌ను వివాహం చేసుకుంది. ఈమెకు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నాయి. భ‌ర్త‌ను పెళ్లి చేసుకుని ముంబైలో స్థిర‌ప‌డింది ఈ భామ‌. అయితే ఇటీవ‌ల ఓ పార్టీలో క‌నిపించిన మాళ‌విక‌ను చూసి ఆమె ఫ్యాన్స్ ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఒక్క‌ప్పుడు ఎంతో అందంగా, ముద్దుగా ఉన్న ఈ బ్యూటి ఇప్పుడు గుర్తు ప‌ట్ట‌డ‌మే చాలా క‌ష్టంగా మారింద‌ట‌. గ్లామ‌ర్ అంతా పోయి, షేప్ అవుట్ అయ్యి మేక‌ప్‌లో ఏ మాత్రం గుర్తుప‌ట్ట‌లేని స్థితిలో ఉంద‌ట మాళ‌విక‌.

మరింత సమాచారం తెలుసుకోండి: