రాజమౌళి సినిమాలకు దేశంలో ఒక డిమాండ్ ఉన్నది. రాజమౌళి సినిమా వస్తుంది అంటే మినిమమ్ గ్యారెంటీ కార్డుతో సినిమా థియేటర్లోకి వస్తుంది.  సినిమా టైటిల్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులు ఆకట్టుకునే విధంగా ఉంటాయి.  రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీ అంతగా ఉంటుంది.  అయితే, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి ఇప్పటి వరకు ఎలాంటి మార్కెటింగ్ ప్రాసెస్ ప్రారంభించలేదని తెలుస్తోంది.  


ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ విషయం ఇంతవరకు తేలలేదు.  ఆర్ఆర్ఆర్ అన్నది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని ప్రకటించారు.  వర్కింగ్ టైటిల్ తో రాజమౌళి సినిమా తీస్తున్నారు.  అసలు టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ.  వీరి సినిమాలు ఏ క్లాస్ సెంటర్లు ఎలా ఉన్న బిసి సెంటర్స్ లో ఆడే విధానం వేరుగా ఉంటుంది.  అందుకే బి సి సెంటర్స్ కోసం సినిమాలు తీస్తుంటారు.

ప్పుడు బి సి సెంటర్స్ కు వెళ్లి ఆర్ఆర్ఆర్ సినిమా అంటే అదేంటి అని అదే పరిస్థితి ఉన్నది.  ఎందులకంటే ఆ సినిమా టైటిల్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.  ఆర్ఆర్ఆర్ టైటిల్ తో సినిమా అంటే ఇదేదో బట్టల దుకాణమా అనుకుంటున్నారు.  పెద్ద మైనస్ పాయింట్ ఇదే కావడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకుంటున్నారు.  పైగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా పోస్ట్ ఫోన్ చేయడంతో ఏం జరుగుతుందో తెలియక అందరు షాక్ అవుతున్నారు.  


ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది.  బాహుబలి రేంజ్ లో సినిమా ఆడాలి అంటే ప్రమోషన్ ఉండాలి.  బాహుబలి సినిమాకు టైటిల్ ను ముందుగానే ప్రకటించారు.  సినిమా స్టోరీ గురించి చెప్పారు.  కానీ, ఆర్ఆర్ఆర్ విషయంలో మాత్రం అంతా గోప్యంగా చేస్తున్నారు.  ఎందుకు ఏంటి అనే విషయాలు మాత్రం బయటకు చెప్పడం లేదు.  ఈ సినిమా ప్రారంభమయ్యి సంవత్సరం కావొస్తోంది.  రిలీజ్ కు మరో సంవత్సరం సమయం ఉన్నది.  మొత్తానికి రాజమౌళి అనుకున్నట్టుగానే సినిమాను ఆలస్యం చేస్తారని మరోసారి రుజువు చేసుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: