మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చిందంటే అభిమానులకు ఎంత పండగో తెలిసిన విషయమే. భారీ కటౌట్లు, పూలదండలు, టిక్కెట్ల కోసం క్యూలు.. ఇలా చెప్పుకుంటూ పోతే అప్పట్లో హడావిడి ఈరోజుల్లో ఎవరూ చేయరు కూడా. అంతటి మెగా సందడికి సాక్ష్యంగా నిలిచిన సినిమాల్లో అల్లుడా మజాకా ఒకటి. దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై కె.దేవీవరప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడదలై ఫిబ్రవరి 25కి 25 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

అప్పట్లో తెలంగాణలో ఫిబ్రవరి 24న విడుదలైతే ఆంధ్రలో ఫిబ్రవరి 25న విడుదలైంది. మొదటి వారం 3కోట్ల 75లక్షల గ్రాస్ వసూలు చేసి ఈ సినిమా రికార్డు సృష్టించింది. అసలే చిరంజీవి అభిమాని అయిన ఈవీవీ ఈ సినిమాలో ఓపెనింగ్ ఫైట్ నే ఎంతో భారీగా తెరకెక్కించారు. క్లైమాక్స్ ఫైట్ ను కూడా అంతే భారీగా తెరకెక్కించి చిరంజీవి మార్క్ ను చూపించారు. సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉందని ఎన్నో విమర్శలు వచ్చాయి. దీంతో సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇస్తామని అప్పట్లో అధికారంలో ఉన్న ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చిరంజీవి అభిమానులు హైదరాబాద్ తో సహా రాష్ట్రం మొత్తం భారీ ఎత్తున నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. దీంతో ప్రభుత్వం ఆ ప్రకటనను వెనక్కు తీసుకుంది కూడా.

IHG

 

చెల్లెలి సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి మెగా హిట్స్ లో ఒకటిగా నిలిచింది. కోటి అందించిన పాటలన్నీ సూపర్ హిట్. శ్రీరాముడిని కీర్తిస్తూ తీసిన మొదటి పాట ఇప్పటికీ పలు పెళ్లిపందిళ్లలో వినిపిస్తూంటుంది. ఖర్చుకు వెనకాడకుండా దేవీవర ప్రసాద్ సినిమాను నిర్మిస్తే ఈవీవీ అదే స్థాయిలో తెరకెక్కించి చిరంజీవికి ఘన విజయాన్ని అందించారు. 70కి పైగా కేంద్రాల్లో 50 రోజులు.. 27 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఈ సినిమా.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: