బాండ్ ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండడు. హాలీవుడ్‌లో వరుసగా వస్తున్న జేమ్స్‌ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ ఉంది. అందుకే ఈ సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. హాలీవుడ్ యాక్షన్‌ చిత్రాలను ఆదరించే సినీ అభిమానులను ఈ సినిమాలు అలరిస్తాయి. తాజాగా జేమ్స్ బాండ్ కొత్త చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  No Time to Die (నో టైం టు డై) టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వరుసగా ట్రైలర్‌లను రిలీజ్ చేస్తున్నారు.

 

ఇప్పటికే రెండు ట్రైలర్‌లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్‌ తాజాగా ఈ సినిమాకు సంబంధించి మూడో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కూడా జేమ్స్ బాండ్ గా డేనియల్ క్రేగ్ నటిస్తున్నారు. ఆయన బాండ్ పాత్రలో కనిపించనున్న చివరి చిత్రం ఇదే కానుంది. ఈ క్రమంలో జేమ్స్ బాండ్ సినిమాపై హాలీవుడ్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అంతేకాదు ఈ సినిమా బాండ్‌ సిరీస్‌లో ఆఖరి సినిమా అన్న ప్రచారం కూడా జరుగుతోంది.

 

సినిమాలో బాండ్ పాత్రను చంపేస్తారా..? లేకపోతే బాండ్‌ రిటైర్‌ అవుతాడా.? అన్న చర్చ మొదలైంది. దీంతో సినిమా కథా కథనాల విషయంలో ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. క్యారీ జోజి ఫుకునగ దర్శకత్వం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గత బాండ్‌ చిత్రాల్లో ఉన్నట్టుగానే అందాల భామలతో బాండ్‌ రొమాన్స్‌.. హై రేంజ్‌ యాక్షన్‌ సీన్స్‌ అన్ని అభిమానులను అలరిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. యూనివర్సల్‌ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్‌లో రిలీజ్‌ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: