సినిమాల్లో నటించే హీరో హీరోయిన్ల పెయిర్ ఎంత అందంగా ఉంటే సినిమాకు అంత ప్లస్. మొదటి సినిమాతోనే సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న జంట నాగచైతన్య – సమంత. వీరిద్దరూ కలిసి నటించిన ‘ఏమాయ చేసావె’ సినిమా విడుదలై నేటికి 10ఏళ్లు పూర్తయ్యాయి. 2010 ఫిబ్రవరి 26న ఈ సినిమా విడుదలైంది. చైతూకు ఇది రెండో సినిమా కాగా సమంతకు ఇదే తొలి సినిమా.

 

 

గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. నాగచైతన్యకు తొలి హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో సమంత ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారి దశాబ్దంగా తన హవా కొనసాగిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ద్విభాషా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళ్ లో శింబు – త్రిష జంటగా వినయతాండి వరువాయాగా తెరకెక్కించారు. తమిళ్ లో ఈ సినిమా అక్కడి నేటివిటీకి అనుగుణంగా క్లైమాక్స్ విషాదంగా తెరకెక్కించారు. తెలుగులో మాత్రం ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా హ్యాపీ ఎండింగ్ ఇచ్చాడు దర్శకుడు. రెండు భాషల్లోనూ సినిమా సూపర్ హిట్ అయింది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మేజర్ ప్లస్. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీతోపాటు ప్రతి విభాగం సినిమాకు ప్లస్ అయ్యాయి.

 

 

ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని, స్వరూప్ ఈ సినిమాను తెలుగులో నిర్మించారు. తెలుగులో వచ్చిన కల్ట్ లవ్ బేస్డ్ మూవీస్ లో ‘ఏమాయ చేసావె’కు కూడా స్థానం ఉంటుంది. సినిమా వచ్చి పదేళ్లయిన సందర్భంగా నాగచైతన్య తన ట్విట్లర్ అకౌంట్ లో సినిమా పోస్టర్ ను పోస్ట్ చేసి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. సినిమా క్లైమాక్స్ లో పెళ్లి చేసుకున్న చైతూ-సమంత రియల్ లైఫ్ లో ఏడేళ్ల పాటు ప్రేమలో ఉండి 2017లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#DecadeOfEvergreenClassicYMC

A post shared by chaitanya Akkineni (@chay_akkineni) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: