తీస్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి అలియాస్ జ్యోతక్క.. పేరు ఏదైనా వెంటనే ఈమె ఎమోష‌న్ మ‌న‌కు గ‌ర్తు వ‌స్తుంది. ఎందుకంటే శివజ్యోతి ప్రతి చిన్న విషయానికి ఎమోటినల్ అవుతూ కంటతడి పెట్టుకుంటూ బిగ్ బాస్ హౌస్ లో కనిపించేది. ఇక ఈమె తెలుగు న్యూస్ ఛానలైన V6లో ప్రతిరోజు రాత్రి 9.30కి వచ్చే తీన్మార్ వార్తల ద్వారా పరిచయమైయింది. బిత్తిరి సత్తి తో కలిసి వార్తలను అందిస్తుంటుంది. అయితే  వి6 న్యూస్‌లో ఉన్నపుడు శివజ్యోతి అంటే ఎవరికీ తెలియదు. అప్పుడు అంతా ఆమెను తీన్మార్ సావిత్రి అన్నారు. కానీ బిగ్ బాస్ 3కి వచ్చిన తర్వాత సావిత్రి కాస్తా శివజ్యోతి అయిపోయింది. అప్పట్నుంచి ఈమెకు క్రేజ్ కూడా బాగానే పెరిగిపోయింది. 

 

జ్యోతి, నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామంలో యశోద, రాజమల్లేష్ దంపతులకు జన్మించింది. తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి ఆర్‌ఎంపీ డాక్టర్. యాంకర్‌గా రాణించాలనుకున్న జ్యోతి, వివిధ ఛానల్స్ లో యాంకరింగ్ చేసింది. అయితే అక్కడ తన భాషని, గొంతును, తెలంగాణ యాసను మార్చుకో..నీది మీడియాకు పనికిరాని గొంతు అన్నారు. దీంతో చాలా ఇబ్బంది ప‌డిన త‌ర్వాత‌.. వి6 ఛానెల్ వారు తెలంగాణ యాసలో వార్తలు చదివేవారికోసం చేసిన ఆడిషన్ లో జ్యోతి ఎంపికైంది. అలా వి6 ఛానల్ లో అవకాశం వచ్చింది. 

 

జ్యోతి గొంతు డిఫరెంట్‌గా ఉండడం, ఆ గొంతును జనాలు ఆదరించడం, వి6 ఛానల్‌కు రేటింగ్ రావడంతోపాటు జ్యోతి తీన్మార్ సావిత్రిగా పాపులర్ అయింది. ఇక ఆ త‌ర్వాత బిగ్ బాస్ షోలో అడుగుపెట్ట‌డం.. ఆమె చాలా పాపుల‌ర్ అవ్వ‌డంతో చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ప్ర‌స్తుతం శివ‌జ్యోతి టీవీ9 ఛానెల్‌లో చేరి ఇస్మార్ట్ సత్తిగా కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇక తాజాగా శివ జ్యోతి హైదరాబాద్ లోని మణికొండలో ఫ్లాట్‌ కొనుక్కుంది. కాస్ట్లీ ఏరియా గా పేరున్న ఆ ప్రాంతంలో శివ‌జ్యోతి త‌న భ‌ర్త‌తో సొంత ఇంట్లో సెటిల్ అయింది. ఈ రోజే ఆమె కొత్త ఇంటి గృహ‌ప్ర‌వేశం. అంచెలంచెలుగా ఎదిగుతూ.. త‌న కోరిక‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డంతో పలువురు ఆమెను అభినందిస్తున్నారు. ఏదైతేనేం.. మొత్తాన్ని జ్యోతక్క సొంత ఇంట్లో సెటిల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: