ఈ యేడాది టాలీవుడ్‌లో సంక్రాంతికి రిలీజ్ అయిన రెండు సినిమాల త‌ర్వాత స‌రైన హిట్ లేక‌పోవ‌డంతో సినీ ప్రియులు విల‌విల్లాడిపోయారు. డిస్కో రాజా, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ లాంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక ఎట్ట‌కేల‌కు ఒక్క హిట్ కోసం మెహం వాచి పోయి ఉన్న తెలుగు సినిమా ప్రియుల బాధ నితిన్ అర్థం చేసుకున్నాడు. నితిన్ న‌టించిన భీష్మ సినిమా ఎట్ట‌కేల‌కు సూప‌ర్ హిట్ అయ్యింది.



మ‌హా శివ‌రాత్రి కానుక‌గా ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన భీష్మ తొలి రోజు తొలి షో నుంచే భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకు పోతోంది. సంక్రాంతి సినిమాల తర్వాత వేరే హిట్ సినిమా లేకపోవడం, భీష్మకి అత్యధిక థియేటర్స్ దొరకడం, పాజిటివ్ టాక్ ఇలా అన్నీ కలిసి నితిన్ కి ఫస్ట్ వీకెండ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 14.9 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే బెస్ట్ ఫ‌స్ట్ వీకెండ్ వ‌సూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది.



ఇక ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు జ‌రిగిన రు. 23 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్‌తో పోలిస్తే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన భీష్మ ఇక నుంచి భారీ లాభాల్లోకి దూసుకు పోనుంది. పైగా ఇప్ప‌ట్లో  భీష్మ‌కు పోటీ ఇచ్చే సినిమాలు లేక‌పోవ‌డం కూడా ఈ సినిమాకు క‌లిసి రానుంది. ఈ లెక్క‌న చూస్తే నితిన్ కెరీర్‌లోనే ఈ సినిమా నెంబ‌ర్ వ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌నుంది.
 

‘భీష్మ’ ఆంధ్ర – తెలంగాణ 5 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

నైజాం – 7.23 కోట్లు

సీడెడ్ – 2.68 కోట్లు

గుంటూరు – 1.64 కోట్లు

ఉత్తరాంధ్ర – 2.29 కోట్లు

ఈస్ట్  – 1.39 కోట్లు

వెస్ట్  – 1.03 లక్షలు

కృష్ణా – 1.15 లక్షలు

నెల్లూరు – 55 లక్షలు
-------------------------------------------------------
భీష్మ 5 రోజుల మొత్తం షేర్ – 17.96 కోట్లు
-------------------------------------------------------

మరింత సమాచారం తెలుసుకోండి: