కోలీవుడ్ స్టార్ సూర్య హిట్ కొట్టాలనే కసిలో ఉన్నాడు. ఈ సారి అన్నీ తానై బంపర్ సక్సెస్ తో సర్ ప్రైజ్ చేయాలని భావిస్తున్నాడు. సక్సెస్ లేని కోలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ కు సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ తనకు కూడా సక్సెస్ ఇస్తోందని నమ్ముతున్నాడు. పైగా ప్రయోగం తనకు బాగా కలిసొస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడట.

 

తమిళ స్టార్ హీరో సూర్య జోరు తగ్గింది. కమర్షియల్ మూవీ చేసిన.. ప్రయోగాలు చేసిన ఈ తమిళ హీరోకు సక్సెస్ మాత్రం కలిసి రావడం లేదు. అయినప్పటికీ సూర్య తనదైన స్టైల్లో ఎక్స్ పెరిమెంట్ మూవీస్ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో సూరరై పొటరు చిత్రంలో నటిస్తున్నాడు. సుధ కొందర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎయిర్ డెక్కన్ స్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతోంది. 

 

తాజాగా సురరై పొట్రు సినిమాకు సంబంధించి మారా అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ పాటను హీరో సూర్య పాడటం విశేషం. ర్యాప్ గొంతుతో పాడిన ఈ పాట తమిళ  ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నారు. 

 

దర్శకురాలు సుధ కొందర.. హీరోగా ఫాం కోల్పోయిన మాధవన్ కు సాలా ఖడ్డూస్ సినిమాతో మంచి సక్సెస్ ఇచ్చింది. ఇదే రిమేక్ తో తెలుగులో వెంకటేష్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఇప్పుడు సూర్య కూడా ఈ దర్శకురాలు తనకు సక్సెస్ ఇస్తుందని నమ్మకంగా ఉన్నాడట. ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి మునుపటి ఫామ్ అందిపుచ్చుకోవాలని ఆపడుతున్నాడట. మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య ఆమెపై పెట్టుకున్న నమ్మకం ఎంత వరకు వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: