యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన శ్రీముఖి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించింది. ' టీవీ' లో వచ్చే పటాస్ షో తో భారీ క్రేజ్ సంపాదించిన ముద్దుగుమ్మ బిగ్ బాస్ సీజన్ -3 లో రన్నరప్ గా నిలిచింది. మొదటి నుంచే బిగ్ బాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ గా పేరుపొందిన శ్రీముఖి చివరి దశలో చేసిన కొన్ని చిన్నపాటి తప్పుల వల్ల టైటిల్ కోల్పోయింది. కానీ ఫలితంతో తన ఫ్యాన్స్ తీవ్రంగానే నిరాశ చెందారు.

 

అయితే తన వీరాభిమానులతో మధ్యనే సోషల్ మీడియా మాధ్యమంలో చాట్ చేసిన శ్రీముఖికి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇప్పటికే ఇంట్లో వాళ్ళు పెళ్లాడమని పోరు పెడుతున్నారు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో శ్రీముఖి ఆమె అభిమానుల గుండెల్లో బాంబు పేల్చే వార్తను చెప్పింది. మధ్య ఆమె సామాజిక మాధ్యమం లో అభిమానులు చేసిన చిట్ చాట్ లో తన లవ్ మరియు పెళ్లి, ముద్దు వ్యవహారాల గురించి అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి.

 

మీరు ప్రేమలో ఉన్నారా?` అన్న ప్రశ్నకు అవును అంటూ చెప్పిన శ్రీముఖి.. `ఎవరైనా ముద్దు పెడతానంటే వద్దన్నారా? అని కొంటెగా ప్రశ్నించారు. దానికి ఏమాత్రం తడబడకుండా అంతే కొంటెగా.. `అవును వద్దన్నా` అంటూ జవాబిచ్చింది. ఇక వీటన్నిటితో పాటు పరీక్షల్లో తాను మాస్ కాపీయింగ్ కొట్టిన సందర్భాలు మరియు స్నేహితులకు అబద్ధాలు చెప్పిన సంగతిని కూడా శ్రీముఖి నిజాయితీగా వేదికపై అంగీకరించింది.

 

ఇంతకీ తను ప్రేమలో ఉన్నానని తేల్చి చెప్పేసిన శ్రీముఖి అది ఎవరితో అన్న విషయం మాత్రం చెప్పలేదు. ఆమె ప్రేమికుడు మరో యాంకర్ అయి ఉండొచ్చా? లేదంటే ఒక పెద్ద స్టార్ నే ప్రేమిస్తుందా? ఇప్పటికే మూడు పదుల వయసులో ఉన్న శ్రీముఖికి ఇంక పెళ్లి ఎప్పుడో?

మరింత సమాచారం తెలుసుకోండి: