సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్నలేటెస్ట్ మూవీ నారప్ప. సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సగానికి పైగా కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళ నాడులో జరుగుతుంది. మార్చి మొదటివారం వరకు అక్కడే షూటింగ్ జరుపనుండగా రెండో వారంలో రామోజీఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రంలో వెంకీ సరసన ప్రియమణి నటిస్తుండగా ఆమె చిన్నప్పటి పాత్రలో మలయాళ నటి రెబ మోనికా జాన్ నటిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో రెబ జాయిన్ అయ్యింది.
 
తెలుగులో ఆమె కు ఇదే మొదటి సినిమా. ఇంతకుముందు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బిగిల్ లో రెబ కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇక కోలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ అసురన్ రీమేక్ గా తెరకెక్కుతున్న నారప్ప మే లో ప్రేక్షకులముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన వెంకీ ఫస్ట్ లుక్ పోస్టర్లు అదరగొట్టడం తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ప్రముఖ తమిళ నిర్మాత కలై పులి ఎస్ థాను, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఈచిత్రాన్ని నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
 
ఒరిజినల్ వెర్షన్ అసురన్ లో ధనుష్ , మంజూ వారియర్ జంటగా నటించగా గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసి 70కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇదిలావుంటే గత ఏడాది సంక్రాంతికి ఎఫ్2 తో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన వెంకటేష్ అదే ఏడాది చివర్లో  వెంకీ మామ తో సూపర్ హిట్ కొట్టాడు. ఈరెండు కూడా మల్టీ స్టారర్ చిత్రాలే. మరి ఇప్పుడు సోలో హీరోగా నారప్ప తో వస్తున్న వెంకీ  హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: