ఈ మధ్య సినిమాలు కాపాడుకోవడం అనేది దర్శక నిర్మాతలకు చాలా కష్టమైపోయింది. సినిమాను ఎన్ని విధాలుగా కస్టపడి తీసినా సరే పైరసీ, లేదా లీకులు ఇలా ఏదోక రకంగా సినిమా ఇబ్బంది పడుతూనే ఉంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొందరు మరీ అతి చేస్తున్నారు. సోషల్ మీడియాలో లైక్స్ కోసం, యుట్యూబ్ ఛానల్ లో డబ్బుల కోసం సినిమాలను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చాలా సినిమాలు ఈ విధంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాయి అనేది వాస్తవం. భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఈ దరిద్రం వెంటాడుతూనే ఉంది. 

 

అత్తారింటికి దారేది సినిమాను కొందరు ఆన్ లైన్ లో విడుదల చేసారు. ఆ తర్వాత చాలా సినిమాలను ఇవి ఇబ్బంది పెట్టాయి. తాజాగా దీని కారణంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇబ్బంది పడ్డారు. ఆయన హీరోగా వస్తున్న కొరటాల శివ సినిమాకు సంబంధించిన ఒక లుక్ ని కొందరు అతి గాళ్ళు సోషల్ మీడియాలో విడుదల చేసారు. దీనితో ఇప్పుడు చిత్ర యూనిట్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఎవరు విడుదల చేసారు అనేది చిత్ర యూనిట్ విచారణలో తెలిసింది అంటున్నారు. ఇప్పటికే సదరు బాధ్యుడ్ని తప్పించారని కూడా అంటున్నారు. 

 

ఈ నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి... దర్శకుడు కొరటాల శివపై ఆగ్రహం వ్యక్తం చేసారట. సినిమా షూటింగ్ సమయంలో ఎవరూ ల్యాప్ టాప్ గాని ఫోన్ గాని తీసుకురాకుండా చూడాలని చిరంజీవి చెప్పారట. చిరంజీవి లుక్‌ను అభిమానులకు స్పెషల్‌గా అందించాలని కొరటాల తాపత్రయపడితే.. ఆయనని డిజప్పాయింట్ చేసేలా ముందుగానే చిరు లుక్ లీక్ చేసారని కొరటాల శివ కూడా ఆగ్రహంగా ఉన్నారట. షూటింగ్ సెట్‌లోకి మొబైల్స్, ల్యాప్ టాప్స్ వంటి వాటికి నిషేధం విధించాలని, ఎవరైనా ఇది అతిక్రమిస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: